క్రీడాభూమి

అనంతపురం, మూలపాడులో ప్రపంచ అంధుల టి-20 మ్యాచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జనవరి 20: రాష్ట్రంలో ప్రపంచ అంధుల క్రికెట్ టి20 మ్యాచ్‌ల నిర్వహణ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగార్రాజు తెలిపారు. భారత అంధుల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో సమర్తనం ట్రస్ట్ సహకారంతో రాష్ట్రంలో రెండవ ప్రపంచ అంధుల క్రికెట్ టి-20 మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, జనవరి 28 నుండి ఫిబ్రవరి 12వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుందని పేర్కొన్నారు. మొత్తం 48 మ్యాచ్‌లు దేశంలో11 ఎంపిక చేసిన పట్టణాల్లో జరుగుతాయని, రాష్ట్రంలోని అనంతపురం ఆర్‌డిటి క్రీడాప్రాగణంలో ఫిబ్రవరి 7న వెస్టీండిస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్, కృష్ణాజిల్లాలోమూలపాడు ఎసిఎ క్రికెట్ క్రీడాప్రాగణంలో ఫిబ్రవరి 8న భారత్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈనెల 29న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిధిగా పాల్గొని రెండవ ప్రపంచ అంధుల టి-20 మ్యాచ్‌లను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈటోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్ర ప్రదేశ్ నుండి నలుగురు క్రికెటర్లు చోటు సాధించినట్లు తెలిపారు. గుంటూరుకు చెందిన ఐ. అజయ్‌కుమార్‌రెడ్డి కెప్టెన్‌గా, శ్రీకాకుళంకు చెందిన డి. వెంకటేశ్వరరావు, టి. దుర్గారావు, కర్నూలుకు చెందిన జి. ప్రేమ్‌కుమార్‌లు సభ్యులుగా ఎంపికైనట్లు పేర్కొన్నారు. అంధుల క్రికెట్‌కు భారతజట్టు మాజీ క్రికెటర్ రాహుల్‌ద్రావిడ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నట్లు బంగార్రాజు పేర్కొన్నారు.