క్రీడాభూమి

కామెంటేటర్ ఆల్డర్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్ ఆడుతున్న వీనస్ విలియమ్స్‌ను ఉద్దేశించి ‘గొరిల్లా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కామెంటేటర్ డౌగ్ ఆల్డర్‌పై వేటు పడింది. జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన అతనిని వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఇఎస్‌పిఎన్ ప్రకటించింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే, కెరీర్‌లో ఏడు పర్యాయాలు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన 13వ సీడ్ వీనస్ మూడో రౌండ్‌లో డువాన్ ఇన్‌గింగ్‌ను 6-1, 6-0 తేడాతో చిత్తుచేసింది. వీనస్ విజృంభణను ప్రస్తావిస్తూ ఆమె ‘గొరిల్లా ప్రేరణ’తో ప్రత్యర్థిపై విరుచుకుపడిందని 1979-81 మధ్యకాలంలో ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడిగా కొనసాగిన ఆల్డర్ వ్యాఖ్యానించాడు. తమ హక్కుల కోసం పోరాడుతున్న నల్లజాతీయులను అతను ‘గొరిల్లా’లుగా అభివర్ణించడమేగాక, ఆ మాటను వీనస్‌కు వర్తింప చేయడం వివాదానికి కారణమైంది. కాగా, మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో కొకో వాండెవాగె 6-4, 3-6, 7-5 తేడాతో యూగెనీ బుచార్డ్‌ను ఓడించింది. టాప్ సీడ్ ఏంజెలిక్ కెర్బర్ 6-0, 6-4 ఆధిక్యంతో క్రిస్టినా ప్లిస్కోవాపై సులభంగా గెలిచింది. క్వాలిఫయర్ మోనా బార్తెల్ 6-4, 3-6, 6-3 తేడాతో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన అషే బార్టీని ఓడించింది. అనస్తాసియా పవ్లిచెన్కోవా 7-5, 4-6, 6-3 ఆధిక్యంతో, ర్యాంకింగ్స్‌లో తన కంటే 12 స్థానాలు మెరుగైన స్థితిలో ఉన్న 11వ ర్యాంకర్ ఎలినా స్విటోలినాపై విజయ భేరి మోగించింది. స్వెత్లానా కుజ్నెత్సొవా 6-4, 5-7, 9-7 స్కోరుతో జెలెనా జన్కోవిచ్‌పై గెలిచి, ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.