క్రీడాభూమి

కెర్బర్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 22: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో ఆదివారం రెండు అసాధారణ ఫలితాలు ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ఆండీ ముర్రే ఓటమితో ఆశ్చర్యానికి గురైన టెన్నిస్ అభిమానులు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఏంజెలిక్ కెర్బర్ నిష్క్రమణతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న కెర్బర్ నాలుగో రౌండ్‌లో కొకొ వాండెవాగె చేతిలో 2-6, 3-6 తేడాతో వరుస సెట్లలో ఓడింది. నిరుడు ఆస్ట్రేలియా ఓపెన్‌తోపాటు, యుఎస్ ఓపెన్‌ను కూడా కైవసం చేసుకొని, మంచి ఫామ్‌లో ఉన్న కెర్బర్ వాస్తవానికి ఈ టోర్నీలో ఫేవరిట్‌గా బరిలోకి దిగింది. ఆమెకు ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న సెరెనా విలియమ్స్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఎవరూ ఊహించని రీతిలో అమెరికాకు చెందిన 25 ఏళ్ల కొకొ వాండెవాగె నుంచి ఆమెకు సవాలు ఎదురైంది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ప్రత్యర్థిని నిలువరించేందుకు కెర్బర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎలాంటి పోటీనివ్వలేకపోయిన ఆమె వరుస సెట్లలో ఓటమిపాలై, క్వార్టర్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.
మరో మ్యాచ్‌లో ఏడో ర్యాంక్ క్రీడాకారిణి గార్బినె ముగురుజా 6-2, 6-3 స్కోరుతో సొరానా సిర్‌స్టియాను ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. సీనియర్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ కూడా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. నాలుగో రౌండ్‌లో ఆమె మోనా బార్తెల్‌ను 6-3, 7-5 తేడాతో చిత్తుచేసింది. మరో మ్యాచ్‌లో అనస్తాసియా పవ్లిచెన్కొవా 6-3, 6-3 స్కోరుతో స్వెత్లానా కుజ్నెత్సెవాపై విజయం సాధించి ముందంజ వేసింది.