క్రీడాభూమి

ముర్రే నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 22: నిన్న ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ నిష్క్రమించగా, ఈసారి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న నంబర్ ర్యాంకర్ ఆండీ ముర్రే కూడా ఓటమిపాలై వెనుదిరిగాడు. అన్‌సీడెడ్ ఆటగాడు మిచా జ్వెరెవ్ 7-5, 5-7, 6-2, 6-4 తేడాతో ముర్రేపై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. సుమారు మూడున్నర గంటలు సాగిన హోరాహోరీలో, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 50వ స్థానంలో ఉన్న జర్మనీ ఆటగాడు మిచా గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతని తమ్ముడు, 19 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్ మూడో రౌండ్‌లో రాఫెల్ నాదల్ చేతిలో ఓడినప్పటికీ చివరి వరకూ పోరాటపటిమ కనబరిచాడు. మ్యాచ్‌ని 6-4, 3-6, 7-6, 3-6, 2-6 తేడాతో ఓడినప్పటికీ ప్రేక్షకుల అభిమానం సంపాదించాడు. కాగా, 29 ఏళ్ల మిచా కూడా తమ్ముడి మాదిరిగానే అద్భుతంగా పోరాడాడు. అయితే, సోదరుడిలా ఓటమిపాలుకాకుండా, విజయభేరి మోగించాడు. ప్రీ క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ముర్రే ఎదురైనప్పటికీ ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని మిచా క్వార్టర్స్ చేరడంతో, ఈసారి పురుషుల విభాగంలో టైటిల్ ఫేవరిట్ ఎవరన్నది ఉత్కంఠ రేపుతున్నది.
ఇలావుంటే, నాలుగో ర్యాంకర్ స్టానిస్లాస్ వావ్రిన్కా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. అతను ప్రీ క్వార్టర్స్‌లో ఆండ్రియాస్ సిప్పీని 7-6, 7-6, 7-6 ఆధిక్యంతో ఓడించాడు. మూడు సెట్లలోనే మ్యాచ్ ముగిసినప్పటికీ, ఈ పోరు కడవరకూ ఉత్కంఠ భరితంగా సాగింది. 12వ ర్యాంకర్ జో విల్‌ఫ్రైడ్ సొంగా 6-7, 6-2, 6-4, 6-4 స్కోరుతో డానియల్ ఇవాన్స్‌పై విజయం సాధించాడు.

చిత్రం..ఆండీ ముర్రే