క్రీడాభూమి

వార్నర్ సెంచరీ.. పాక్‌పై ఆస్ట్రేలియా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 22: ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగడంతో, పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన నాలుగో వనే్డను 86 పరుగుల తేడాతో గెల్చుకున్న ఆస్ట్రేలియా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. దీనితో చివరిదైన ఐదో వనే్డ ఫలితం నామమాత్రమవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 353 పరుగుల భారీ స్కోరు సాధించింది. వార్నర్ 119 బంతులు ఎదుర్కొని 130 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 11 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ స్మిత్ 49, ట్రావిస్ హెడ్ 51, గ్లేన్ మాక్స్‌వెల్ 78 పరుగులతో రాణించడంతో ఆసీస్‌కు గౌరవ ప్రదమైన స్కోరు సాధ్యమైంది. పాక్ బౌలర్లలో హసన్ అలీ 52 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఆసీస్‌ను ఓడించి, ఈ సిరీస్‌పై ఆశలను సజీవంగా నిలుపుకోవడానికి 354 పరుగులు సాధించాల్సి ఉండగా, పాక్ 43.5 ఓవర్లలో 267 పరుగులకే ఆలౌటైంది. ఓపెన్ షర్జీర్ ఖాన్ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహమ్మద్ హఫీజ్ (40), షోయబ్ మాలిక్ (47) జట్టును ఆదుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మిగతా వారు పరుగుల వేటలో తడబడడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లు జొస్ హాజెల్‌వుడ్, ఆడం జంపా చెరి 3 వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 6 వికెట్లకు 353 (వార్నర్ 130, స్టీవెన్ స్మిత్ 49, ట్రావిస్ హెడ్ 51, గ్లేన్ మాక్స్‌వెల్ 78, హసన్ అలీ 5/52).
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 43.5 ఓవర్లలో 267 ఆలౌట్ (షర్జీల్ ఖాన్ 74, మహమ్మద్ హఫీజ్ 40, షోయబ్ మాలిక్ 47, జొస్ హాజెల్‌వుడ్ 3/54, ఆడం జంపా 3/55).