క్రీడాభూమి

మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్ విజేత సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరవాక్ (మలేసియా), జనవరి 22: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరిగిన మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె పొర్న్‌పవీ చొచువాంగ్‌ను 22-20, 22-20 తేడాతో ఓడించింది. రెండు సెట్లలోనూ సైనా చివరి వరకూ పోరాడాల్సి వచ్చింది. మొదటి సెట్‌లో ప్రత్యర్థి విజయానికి కేవలం ఐదు పాయింట్ల దూరంలో ఉండగా, ఆమెను అక్కడే నిలువరించిన సైనా తీవ్ర స్థాయిలో దాడికి దిగింది. రెండో సెట్‌లోనూ దాదాపు అలాంటి పరిస్థితే ఎదురైంది. రెండు సెట్లలో చెమటోడ్చిన సైనా ఈ ఏడాది తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ కూడా చేరకుండానే వైదొలగడం, ఆతర్వాత మోకాలికి శస్త్ర చికిత్స జరగడం వంటి అంశాలు ఆమె కెరీర్‌పై అనుమానాలను రేపాయి. ఆపరేషన్ తర్వాత మళ్లీ కెరీర్‌ను మొదలుపెట్టిన తర్వాత క్రమంగా కోలుకుంటున్నట్టు కనిపించిన సైనా పూర్తి ఫామ్‌లోకి వచ్చినట్టు ఈ టోర్నమెంట్‌లో ఆమె ప్రస్థానం స్పష్టం చేసింది. భవిష్యత్తుపై ఆశలు పెంచింది.
ఇలావుంటే, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఇంగ్ కా లాంగ్ ఆన్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో అతను లీ హ్యున్ ఈపై గెలిచాడు. మొదటి సెట్‌ను 14-21 తేడాతో ఓడిపోయిన లాంగ్ ఆన్ రెండో సెట్‌ను 21-15 ఆధిక్యంతో సొంతం చేసుకొని, మూడో సెట్‌లో 10-9 ఆధిక్యాన్ని సంపాదించాడు. ఈ దశలో కండరాలు బెణకడంతో హ్యున్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. టైటిల్ లాంగ్ ఆన్‌కు లభించింది.

చిత్రం..మలేసియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన సైనా నెహ్వాల్