క్రీడాభూమి

కోహ్లీని వేధిస్తున్న సమస్యలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, జనవరి 25: ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుండగా, ప్రధాన సమస్యలు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వేధిస్తున్నాయి. టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో చిత్తుచేసిన భారత్ ఆతర్వాత వనే్డ సిరీస్‌ను 2-1 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. టి-20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకొని, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కొత్తగా నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ తన సామర్థ్యాన్ని చాటుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అయితే, ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్లు ఎవరితో వేయించాలి? అన్న ప్రశ్న కోహ్లీని వెంటాడుతున్నది. దీనికితోడు ఓపెనర్ల వైఫల్యాలు కూడా అతనిని వేధిస్తున్నాయి. స్వదేశంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తాడనుకున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎందుకు రాణించలేకపోతున్నాడో అర్థంగాక టీమిండియా కెప్టెన్ మల్లగుల్లాలు పడుతున్నాడు. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే కనిపిస్తున్నప్పటికీ, ఈ మూడు సమస్యలు కోహ్లీని ఇప్పట్లో వదిలేవిగా కనిపించడం లేదు.
ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డ సిరీస్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఇన్నింగ్స్ చివరిలో డెత్ ఓవర్లు ఎవరితో వేయించాలన్నది కోహ్లీకి సవాలుగా మారింది. ఉమేష్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, కేదార్ జాదవ్ సగటున ఓవర్‌కు 7.5 చొప్పున పరుగులు సమర్పించుకున్నారు. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు రాణించలేకపోవడంతో మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ 300లకు పైగా పరుగులు చేయగలిగింది. మొదటి వనే్డ చివరి పది ఓవర్లలో భారత బౌలర్లు 115 పరుగులిచ్చారు. రెండో వనే్డలో 97, చివరిదైన మూడో వనే్డలో 86 చొప్పున పరుగులు ధారాదత్తం చేశారు. లేకపోతే, ఇంగ్లాండ్‌కు భారీ స్కోర్లు సాధ్యమయ్యేవి కావు. ఈ విభాగంలో కోహ్లీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఓపెనర్లు ఎవరు?
ఓపెనర్లగా ఎవరిని బరిలోకి దించాలన్న ప్రశ్నకు కోహ్లీ సమాధానం వెతుక్కోవాల్సి ఉంది. ఇంగ్లాండ్‌తో మొదటి రెండు వనే్డలకు లోకేష్ రాహుల్‌కు తోడుగా శిఖర్ ధావన్ ఓపెనర్‌గా దిగితే, అతను గాయపడడంతో చివరి వనే్డలో రహానేకు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం దక్కింది. మూడు మ్యాచ్‌ల్లో భారత్ మొదటి వికెట్‌కు వరుసగా 13, 14, 13 చొప్పున మాత్రమే పరుగులు జోడించగలిగింది. రాహుల్ 8, 5, 11 పరుగులు చేసి అవుట్‌కాగా, మొదటి రెండు వనే్డలు ఆడిన ధావన్ 1, 11 చొప్పున పరుగులు చేశాడు. చివరి వనే్డలో ఆడిన రహానే సింగిల్ తీసి అవుటయ్యాడు. కాగా, గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ మ్యాచ్‌లకు సిద్ధంగా ఉన్నాడు. రాహుల్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడానికి అతను రహానేతో పోటీపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఏ కాంబినేషన్‌కు ఆమోద ముద్ర వేస్తాడో చూడాలి.