క్రీడాభూమి

సహచరుడి నిర్వాకం.. బోల్ట్‌కు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసస్నే, జనవరి 26: సహచరుడు డోప్ పరీక్షలో పట్టుబడడం ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒలింపిక్స్‌లో అతను తొమ్మిది స్వర్ణాలు సాధించగా, జమైకా రిలే జట్టు సభ్యుడు నెస్టా కార్టర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు రుజువైంది. దీనితో రిలేలో జమైకా సాధించిన స్వర్ణ పతకాన్ని అధికారులు రద్దు చేయగా, బోల్ట్ ఒక పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో 100, 200 మీటర్ల పరుగుతోపాటు 4న100 మీటర్ల రిలేలోనూ బోల్ట్ స్వర్ణాలను సాధించాడు. ఆతర్వాత లండన్ ఒలింపిక్స్, రియో ఒలింపిక్స్‌లో ఇదే ఫీట్‌ను పునరావృతం చేసి, మొత్తం తొమ్మిది ఒలింపిక్ స్వర్ణాలను తన ఖాతాలో చేర్చుకున్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో రిలే రేస్‌ను బోల్ట్, నెస్టా కార్టర్, మైఖేల్ ఫ్రాటర్, అసాఫా పావెల్ సభ్యులుగా ఉన్న జమైకా జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. అందులోని నెస్టా కార్టర్ డోపింగ్‌కు పాల్పడడంతో, జమైకా స్వర్ణ పతకాన్ని రద్దు చేసిన అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) ద్వితీయ స్థానం దక్కించుకున్న ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టును విజేతగా ప్రకటించింది. ఆ జట్టులో రిచర్డ్ థాంసన్, ఎమాన్యుయెల్ కాలెన్‌డర్, కెస్టన్ బ్లెండ్‌మన్, మార్క్ బర్న్స్ సభ్యులు. ఇక, అప్పుడు మూడో స్థానంలో నిలిచిన జపాన్ జట్టుకు జమైకాపై వేటు పడడంతో రజత పతకం లభించింది. ఈ జట్టులో నవోకీ సుకహరా, షింగో సెట్‌సుగు, షింజీ తకహిరా, నొబుహరూ అసాహరా సభ్యులు. కాగా, అప్పట్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్న వినె్సంట్ లెనిల్సన్, సాండ్రో వియానా, బ్రూనో డి బరోస్, జొస్ కార్లొస్ మొరీరా సభ్యులుగా ఉన్న బ్రెజిల్‌ను కాంస్య పతక విజేతగా ఐఒసి అధికారులు ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రం.. ఉసేన్ బోల్ట్