క్రీడాభూమి

చివరి వనే్డలో దక్షిణాఫ్రికాపై లంక గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, జనవరి 26: దక్షిణాఫ్రికాపై శ్రీలంక ఎదురుదాడికి దిగింది. చివరిదైన మూడో వనే్డను ఐదు వికెట్ల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రత్యర్థిని 169 పరుగులకే కట్టడి చేసిన లంక ఆతర్వాత మరో బంతి మిగిలి ఉండగా, ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 169 పరుగులు చేయగా, గాయానికి శస్త్ర చికిత్స చేయించుకొని, పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ కెరీర్‌ను ప్రారంభించిన ఎబి డివిలియర్స్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రీజా హెండ్రిక్స్ (41), వికెట్‌కీపర్ మన్గలిసో మొసే (32 నాటౌట్) దక్షిణాఫ్రికాను ఆదుకోవడానికి ప్రయత్నించారు. లంక బౌలర్లలో నువాన్ కులశేఖర, సికుగే ప్రసన్న, లక్షన్ సాండకన్, అసెల గుణరత్నే తలా ఒక్కో వికెట్ కూల్చారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్ నిరోషన్ డిక్‌విల్లా అండగా నిలిచాడు. అతను 51 బంతులు ఎదుర్కొని, పది ఫోర్లు, ఒక సిక్సర్‌త 68 పరుగులు సాధించాడు. చివరిలో ప్రసన్న 16 బంతుల్లోనే, మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 37 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచి, హోరాహోరీ పోరులో లంకను గెలిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ 18 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. టాప్ స్కోరర్ డిక్‌విల్లాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ అతనే ఎంపికయ్యాడు.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 (ఎబి డివిలియర్స్ 63, మన్గలిసో మోసే 32 నాటౌట్, నువాన్ కులశేఖర 1/30, సికుగే ప్రసన్న 1/21, లక్షన్ సాండకన్ 1/23, అసెల గుణరత్నే 1/34).
శ్రీలంక ఇన్నింగ్స్: 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 170 (నిరోషన్ డిక్‌విల్లా 68, సికూగె ప్రసన్న 37 నాటౌట్, ఇమ్రాన్ తాహిర్ 3/18).