క్రీడాభూమి

టి-20 సిరీస్‌లో ఇంగ్లాండ్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, జనవరి 26: భారత్‌తో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో ఇంగ్లాండ్ బోణీ చేసింది. గురువారం జరిగిన మొదటి మ్యాచ్‌ని ఏడు వికెట్ల తేడాతో గెల్చుకొని, 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. 148 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే, మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 147 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అజేయంగా 36 పరుగలు సాధించగా, సురేష్ రైనా 23 బంతుల్లో 34 పరుగులు చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్ అనుకున్నంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ మోయిన్ అలీ 21 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు.
మోర్గాన్ హాఫ్ సెంచరీ
భారత్‌తో జరిగిన టెస్టు, వనే్డ సిరీస్‌లను చేజార్చుకున్న ఇంగ్లాండ్ టి-20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఆడింది. ఓపెన్లు జాసన్ రాయ్ (19), సాబ్ బిల్లింగ్స్ (22) తక్కువ స్కోర్లకే అవుటైనప్పటికీ, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అర్ధ శతకంతో రాణించాడు. జో రూట్ 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టు 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు సాధించి, ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. కాగా, భారత బౌలర్లలో యుజువేంద్ర చాహల్ 27 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. కెరీర్‌లో మొట్టమొదటి టి-20 మ్యాచ్ ఆడిన పర్వేజ్ రసూల్ 4 ఓవర్లు బౌల్ చేసి 32 పరుగులకు ఒక వికెట్ కూల్చాడు.
స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: విరాట్ కోహ్లీ సి మోర్గాన్ బి మోయిన్ అలీ 29, లోకేష్ రాహుల్ సి అదిల్ రషీద్ బి క్రిస్ జోర్డాన్ 8, సురేష్ రైనా బి బెన్ స్టోక్స్ 34, యువరాజ్ సింగ్ సి అదిల్ రషీద్ బి లియామ్ ప్లంకెట్ 12, మహేంద్ర సింగ్ ధోనీ 36 నాటౌట్, మనీష్ పాండే ఎల్‌బి మోయిన్ అలీ 3, హార్దిక్ పాండ్య సి సామ్ బిల్లింగ్స్ బి టైమల్ మిల్స్ 9, పర్వేజ్ రసూల్ రనౌట్ 5, జస్‌ప్రీత్ బుమ్రా 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 147.
వికెట్ల పతనం: 1-34, 2-55, 3-75, 4-95, 5-98, 6-118, 7-145.
బౌలింగ్: టైమల్ మిల్స్ 4-0-27-1, క్రిస్ జోర్డాన్ 4-0-27-1, లియామ్ ప్లంకెట్ 4-0-32-1, బెన్ స్టోక్స్ 4-0-37-1, మోయిన్ అలీ 4-0-21-2.
భారత్ ఇన్నింగ్స్: జాసన్ రాయ్ బి యుజువేంద్ర చాహల్ 19, సామ్ బిల్లింగ్స్ బి యుజువేంద్ర చాహల్ 22, జో రూట్ 46 నాటౌట్, ఇయాన్ మోర్గాన్ సి సురేష్ రైనా బి పర్వేజ్ రసూల్ 51, బెన్ స్టోక్స్ 2 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1-42, 2-43, 3-126.
బౌలింగ్: ఆశిష్ నెహ్రా 3-0-31-0, జస్‌ప్రీత్ బుమ్రా 3.1-0-26-0, యుజువేంద్ర చాహల్ 4-0-27-2, పర్వేజ్ రసూల్ 4-0-32-1, సురేష్ రైనా 2-0-17-0, హార్దిక్ పాండ్య 2-0-12-0.

చిత్రం..అర్థ సెంచరీతో రాణించిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్