క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో అక్కాచెల్లెళ్ల సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 26: ‘విలియమ్స్ సిస్టర్స్’ వీనస్, సెరెనా మరోసారి ఆధిపత్య పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో వీరిద్దరూ టైటిల్ కోసం యుద్ధానికి సై అనడంతో, చాలాకాలం తర్వాత అభిమానులకు మరో ఆసక్తికరమైన మ్యాచ్‌ని తిలకించే అవకాశం దక్కనుంది. మొదటి సెమీ ఫైనల్‌లో వీనస్ 6-7, 6-2, 6-3 తేడాతో కొకో వాండెవాగ్‌ను ఓడించగా, మరో సెమీస్‌లో సెరెనా 6-2, 6-1 ఆధిక్యతో మిర్జానా లూసిక్ బరోనీని చిత్తుచేసి ఫైనల్ చేరింది. కాగా, వివిధ టోర్నీల్లో ఇప్పటి వరకూ వీనస్, సెరెనా 27 పర్యాయాలు పరస్పరం తలపడ్డారు. సెరెనా 16 మ్యాచ్‌లు గెల్చుకోగా, వీనస్ 11 విజయాలు నమోదు చేసింది. చివరిసారి వీరిద్దరూ 2015 యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో ఎదురుపడ్డారు. ఆ మ్యాచ్‌ని సెరెనా 6-2, 1-6, 6-3 తేడాతో సొంతం చేసుకుంది. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో వీరు గతంలో రెండు సార్లు తలపడ్డారు. 1998లో మొదటిసారి వీరు రెండో రౌండ్‌లో పోటీపడ్డారు. వీనస్ 7-6, 6-1 తేడాతో సెరెనాను ఓడించింది. 2003 ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో వీనస్‌పై సెరెనా 7-6, 3-6, 6-4 తేడాతో నెగ్గింది. మొత్తం మీద ఒక సంవత్సరంలో మొదటి గ్రాండ్ శ్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండుసార్లు ఢీకొన్న వీనస్, సెరెనా చెరొక విజయంతో సమవుజ్జీలుగా ఉన్నారు. మెల్బోర్న్‌లో మూడోసారి వీరి మధ్య జరిగే పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిని రేపుతున్నది. అయితే, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న సెరెనాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సెరెనా రెండో స్థానంలో, వీనస్ 17వ స్థానాల్లో ఉండడం ఈ అంచనాకు ఒక కారణమైతే, ఇటీవల కాలంలో వివిధ టోర్నీల్లో వీరిద్దరూ సాధించిన విజయాల గణాంకాలు మరో కారణం.
గంటలోపే..
సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి లూసిక్ బరోనీతో మ్యాచ్‌ని కేవలం 50 నిమిషాల్లోనే ముగించింది. 1999లో వింబుల్డన్ తర్వాత తొలిసారి ఒక మేజర్ టోర్నీలో సెమీ ఫైనల్ ఆడిన 34 ఏళ్ల బరోనీ మ్యాచ్ ముగిసిన వెంటనే సెల్ఫీలు తీసుకుంటూ కొంత సేపు కోర్టులోనే గడిపింది. ఆతర్వాత ప్రేక్షకులకు అభివాదం చేస్తూ నిష్క్రమించింది. కాగా, తన సోదరి వీనస్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ని సెరెనా ఆసాంతం తిలకించలేకపోయింది. అయితే, ఆమె తన సెమీ ఫైనల్ మ్యాచ్‌ని మొదలుపెట్టే సమయంలోనే వీనస్ ఫైనల్ చేరిన విషయాన్ని తెలుసుకుంది.
నవ్రతిలోవా తర్వాత..
మార్టినా నవ్రతిలోవా 1994 వింబుల్డన్ ఫైనల్ చేరినప్పుడు ఆమె వయసు 37 సంవత్సరాల 258 రోజులు. ఆమె తర్వాత, ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన ఎక్కువ వయసుగల క్రీడారిణిగా 36 ఏళ్ల వీనస్ విలియమ్స్ రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకుంది.

సుమారు రెండున్నర గంటలు పోరాడిన తర్వాత కొకో వాండెవాగ్‌పై విజయం సాధించిన వెంటనే ర్యాకెట్‌ను దూరంగా విసిరేసిన వీనస్, తాను ఫైనల్ చేరిన విషయాన్ని నమ్మలేకపోయిన ఆమె రెండు చేతులతో కప్పుకొని కొద్దిసేపు అక్కడే కూలబడింది. ఆమె 2009 వింబుల్డన్ తర్వాత మొట్టమొదటిసారి ఒక గ్రాండ్ శ్లామ్‌లో ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా గ్రాండ్ శ్లామ్‌లో ఏకంగా 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ పోరులో తలపడే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక్కడ చివరిసారి ఆమె 2003లో ఫైనల్ చేరింది. కెరీర్‌లో ఏడు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను దక్కించుకున్న ఆమె 2008 తర్వాత ఇంత వరకూ ఒక్క టైటిల్‌ను కూడా అందుకోలేదు.

చిత్రం..‘విలియమ్స్ సిస్టర్స్’ వీనస్, సెరెనా