క్రీడాభూమి

‘టాప్’ కమిటీ చైర్మన్‌గా బింద్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించడంతోపాటు, సమర్థులను గుర్తించి, వారికి తగిన అత్యుత్తమ శిక్షణ ఇప్పించడానికి ఏర్పడిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) చైర్మన్‌గా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ఏస్ షూటర్ అభినవ్ బింద్రా ఎంపికయ్యాడు. ఇంతకు ముందు కూడా ‘టాప్’లో బింద్రా సభ్యుడిగా కొనసాగాడు. అయితే, నిరుడు రియో ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేశాడు. ఇప్పుడు కమిటీని పునర్ వ్యవస్థీకరించగా, చైర్మన్ పదవి బింద్రాకు లభించింది. మాజీ స్ప్రింట్ స్టార్ పిటి ఉష, ఒకప్పటి బాడ్మింటన్ హీరో ప్రకాష్ పదుకొనే, మహిళా షూటర్ అంజలి భవగత్, 2000 సిడ్నీ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, రెజ్లర్ కరణం మల్లీశ్వరి కూడా పది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో ఉన్నారు. వీరంతా క్రీడాకారులుకాగా, అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) జీవితకాల అధ్యక్షుడు అనిల్ ఖన్నా, బాక్సింగ్ ఎడ్మినిస్ట్రేటర్ పికె మురళీధరన్ రాజా, రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు కార్యదర్శి రేఖా యాదవ్, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాయ్, సంయుక్త కార్యదర్శి ఇందర్ ధమిజా మిగతా ఐదుగురు సభ్యులు. 2020 ఒలింపిక్స్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ పతకాలు సాధించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు.

చిత్రం..అభినవ్ బింద్రా