క్రీడాభూమి

న్యూజిలాండ్ టూర్‌లో ఆసీస్‌కు వేడ్ కెప్టెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 27: న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ పాకిస్తాన్‌తో అడెలైడ్‌లో జరిగిన చివరి, ఐదో వనే్డలో ఫీల్డింగ్ చేస్తూ కిందపడ్డాడు. అతని ఎడమకాలి మడమ బెణికిందని, దీనితో అతనికి విశ్రాంతి అవసరమైందని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వైస్-కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచి విశ్రాంతినివ్వాలని ఇది వరకే నిర్ణయించడంతో, వేడ్‌కు జట్టు పగ్గాలు అప్పచెప్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా వనే్డ జట్టుకు 23 మంది నాయకత్వం వహించగా, 24వ కెప్టెన్‌గా వేడ్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నాడు. న్యూజిలాండ్‌తో ఆసీస్ మూడు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో పాల్గొంటుంది. వచ్చేనెల ఆసీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది.

చిత్రం..మాథ్యూ వేడ్