క్రీడాభూమి

ఫాస్ట్ బౌలర్ షమీకి పితృ వియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, జనవరి 27: భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తండ్రి తౌసిఫ్ అలీ గుండె పోటుతో మృతి చెందాడు. దీనితో మోకాలి గాయానికి ఇక్కడ చికిత్స పొందుతున్న షమీ హుటాహుటిన తన స్వస్థలం ఆమ్రోహాకు వెళ్లిపోయాడు. ఇంగ్లాండ్‌తో మొదటి టి-20 మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు షమీ కాలికి గాయమైంది. ఈనెల 5వ తేదీన మొదటిసారి గుండె పోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన తౌసిఫ్ అక్కడ చికిత్స పొందుతున్నాడు. గురువారం రాత్రి మరోసారి గుండె పోటుకు గురికావడంతో అతను మృతి చెందినట్టు సమాచారం అందింది. వార్త విన్న వెంటనే షమీ పునరావాస కేంద్రాన్ని విడిచి స్వస్థలానికి వెళ్లాడు. కాగా, భారత జట్టులోని మిగతా సభ్యులు శుక్రవారం ఉదయం లక్నోకు బయలుదేరారు. అక్కడి నుంచి వారు మరో విమానంలో నాగపూర్‌లో చేరారు. అక్కడ ఇంగ్లాండ్‌తో ఆదివారం రెండో టి-20 మ్యాచ్ జరుగుతుంది.