క్రీడాభూమి

నాదల్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 27: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో మొదటి నుంచి దూకుడుగా అడుతున్న అతను అదే ఒరవడిని కొనసాగించి, సుమారు ఐదు గంటలు శ్రమించి, సెమీ ఫైనల్‌లో గ్రిగర్ దిమిత్రోవ్‌ను 6-3, 5-7, 7-6, 6-7, 6-4 తేడాతో ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో ప్రపంచ రికార్డును తన పేరిట రాసుకున్న రోజర్ ఫెదరర్‌ను అతను టైటిల్ పోరులో ఢీ కొంటాడు. 2014లో చివరిసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన అతను ఆతర్వాత గాయాల కారణంగా ఎక్కువ కాలం వివిధ టోర్నీలకు దూరమయ్యాడు. ఆడిన మ్యాచ్‌ల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 2009లో అతను ఫెదరర్‌ను ఎదుర్కొన్నప్పుడు 7-5, 3-6, 7-6, 3-6, 6-2 తేడాతో విజయభేరి మోగించాడు. 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను ఇప్పటి వరకూ సాధించిన అతను ఆదివారం జరిగే ఫైనల్‌లో ఫెదరర్‌ను ఓడిస్తే, ఓపెన్ శకం ప్రారంభమైన తర్వాత నాలుగు గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీలను కనీసం రెండేసి పర్యాయాలు గెల్చుకున్న తొలి క్రీడాకారుడిగా, మొత్తం మీద టెన్నిస్ చరిత్రలోనే మూడో ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కుతాడు. ఫెదరర్ గెలిస్తే, అతని ఖాతాలో మరో గ్రాండ్ శ్లామ్ టైటిల్ చేరుతుంది. టైటిళ్ల రికార్డు మరింత మెరుగవుతుంది.