క్రీడాభూమి

సింధు, సమీర్‌కు టైటిళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 29: సయ్యద్ మోదీ స్మారక బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పివి సింధు కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. కాగా, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు రెండో స్థానమే దక్కింది. మహిళల సింగిల్స్‌లో గ్రెగోరియా మరిస్కాతో తలపడిన సింధు 21-13, 21-14 తేడాతో విజయం సాధించి, ఈ ఏడాది తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ మన దేశానికే చెందిన సాయి ప్రణీత్‌ను 21-19, 21-16 ఆధిక్యంతో ఓడించి విజేతగా నిలిచాడు. అయితే, మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప, సిక్కీ రెడ్డి జోడీకి ఎదురుదెబ్బ తగిలింది. క్రిసియానా పెడెర్సెన్, కామిలా జుల్ జోడీ 21-16, 21-18 తేడాతో అశ్వినీ, సిక్కీ రెడ్డి జోడీని ఓడించింది. పురుషుల సింగిల్స్ మాదిరిగానే మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారతీయుల మధ్యే టైటిల్ పోరు జరిగింది. ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ 22-20, 21-10 స్కోరుతో అశ్వినీ పొన్నప్ప, సుమీత్ రెడ్డి జోడీపై విజయం సాధించి టైటిల్ సాధించింది. కాగా, మథియాస్ బొయే, కార్‌స్టెన్ మోగెన్‌సెన్ జోడీ పురుషుల డబుల్స్ ఫైనల్‌లో లూ చింగ్ యవో, యాంగ్ పొ హాన్ జోడీని 21-14, 21-15 స్కోరుతో ఓడించి టైటిల్ అందుకుంది.

చిత్రం..సయ్యద్ మోదీ స్మారక బాడ్మింటన్ టైటిళ్లను సాధించిన సింధు, సమీర్ వర్మ