క్రీడాభూమి

గుప్టిల్‌కు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జనవరి 31: ఆస్ట్రేలియాతో రెండో వనే్డ క్రికెట్ మ్యాచ్‌లో తలపడబోతున్న న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ దూరమయ్యాడు. చీలమండ గాయంతో అతను ఇబ్బందులు పడుతుండటమే ఇందుకు కారణమని న్యూజిలాండ్ జట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న చాపెల్-హ్యాడ్లీ ట్రోఫీ వనే్డ సిరీస్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో ఆక్లాండ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గుప్తిల్ 61 పరుగులతో రాణించి న్యూజిలాండ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే ఆ మ్యాచ్‌లో గుప్టిల్ ఫీల్డింగ్ చేస్తుండగా చీలమండకు స్వల్ప గాయమైందని, దీంతో ముందు జాగ్రత్త చర్యగా నేపియర్‌లో జరుగనున్న రెండో వనే్డ నుంచి అతనికి విశ్రాంతి కల్పించి, రెండేళ్ల క్రితం జాతీయ జట్టులో ఆడిన నార్తరన్ డిస్ట్రిక్ట్స్ బ్యాట్స్‌మన్ డీన్ బ్రౌన్లీని మళ్లీ జట్టులోకి తీసుకున్నామని న్యూజిలాండ్ కోచ్ మైక్ హెసన్ వివరించాడు.