క్రీడాభూమి

నైట్‌రైడర్స్‌లోకి బాలాజీ బౌలింగ్ కోచ్‌గా నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 31: టీమిండియా మాజీ పేస్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2017 ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో తమ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రకటించింది. గత ఏడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన బాలాజీ ఆ తర్వాత తమిళనాడు జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 2011 నుంచి 2013 వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ విభాగంలో ముఖ్యుడిగా ఉన్న బాలాజీ 2012లో ఆ జట్టు ఐపిఎల్ టైటిల్ సాధించడంలో కీలక భూమిక పోషించిన విషయం విదితమే. మళ్లీ కోల్‌కతా నైట్‌రైడర్స్ కుటుంబంలోకి వస్తున్న బాలాజీకి సాదరంగా స్వాగతం పలికేందుకు ఎంతగానో సంతోషిస్తున్నామని, 2012లో తమ జట్టు ఐపిఎల్ టైటిల్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన బాలాజీని ఇప్పుడు తమ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నామని నైట్‌రైడర్స్ సిఇఓ మంగళవారం ముంబయిలో వెల్లడించాడు. నైట్‌రైడర్స్ బౌలింగ్ కోచ్‌గా తాను నిర్వర్తించనున్న కొత్తపాత్ర గురించి బాలాజీ మాట్లాడుతూ, ఇంతకుముందు ఆ జట్టు ఆటగాడిగా ఎంతో ఆస్వాదించానని, జట్టు యాజమాన్యం ఎంతో నమ్మకంతో ఇప్పుడు తనను బౌలింగ్ కోచ్‌గా నియమించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు.