క్రీడాభూమి

ముర్రేకు నిరాశే జకోవిచ్‌కే టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 31: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పరుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను బ్రిటిష్ ఆటగాడు, రెండో సీడ్ ఆండీ ముర్రేను 6-1, 7-5, 7-6 ఆధిక్యంతో ఓడించాడు. మొదటి సెట్‌ను సులభంగానే గెల్చుకున్న జొకోవిచ్‌కు తర్వాతి రెండు సెట్లలో ముర్రే నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ఇరువురు ఆటగాళ్లు నువ్వా నేనా అన్న చందంగా తలపడ్డారు. ఇరువురి పోరాటం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయితే, ముర్రేను చివరి రెండు సెట్లలోనూ కట్టడి చేసిన జొకోవిచ్ కెరీర్‌లో 11వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. వీటిలో ఆరు ఆస్ట్రేలియా ఓపెన్‌లో కైవసం చేసుకున్నవే కావడం విశేషం. ఇంత ముందు అతను 2008, 2011, 2012, 2013, 2015 సంవత్సరాల్లో అతను ఇక్కడ విజేతగా నిలిచాడు. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. వింబుల్డన్‌లో మూడు, యుఎస్ ఓపెన్‌లో రెండు టైటిళ్లు కైవసం చేసుకున్న అతనికి మరో గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇప్పటి వరకూ టైటిల్ దక్కలేదు. కాగా, జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా ఓపెన్ అచ్చొచ్చిందని, అతను మరోసారి విజేతగా నిలవడం ఖాయమని విశే్లషకులు చేసిన అంచనాలు నిజమయ్యాయి. కెరీర్‌లో యుఎస్ ఓపెన్ (2012), వింబుల్డన్ (2013) టైటిళ్లు మాత్రమే గెల్చుకున్న ముర్రే ఏ విధంగానూ గట్టిపోటీని ఇవ్వలేడన్న వాదన వినిపించినా, అది కూడా తప్పేనని రుజవైంది. ముర్రే అసాధారణ స్థాయిలో పోరాడాడు. ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ తన పోరాట పటిమతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఐదోసారి ఫైనల్ చేరిన ముర్రేకు మరోసారి రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందక తప్పలేదు. ఇంతకు ముందు 2010, 2011, 2013, 2015 సంవత్సరాల్లో ఫైనల్ వరకూ చేరినా ఫలితం లేకపోయింది. అదే పరిస్థితి మరోసారి పునరావృతమైంది. గత ఏడాది అతను ఫైనల్‌లో జొకోవిచ్‌నే ఢీకొని, 6-7, 7-6, 3-6, 0-6 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. అప్పుడు నాలుగు సెట్ల మ్యాచ్ జరిగితే, ఈసారి టైటిల్ పోరు మూడు సెట్లలోనే ముగిసింది. కానీ, గత ఏడాది కంటే ముర్రే ఈసారి విశేషంగా శ్రమించాడనే చెప్పాలి. సెమీ ఫైనల్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన రోజర్ ఫెదరర్‌ను ఓడించిన అతను టైటిల్‌ను అందుకునేందుకు చెమటోడ్చినప్పటికీ జొకోవిచ్ అందుకు దీటైన సమాధానమే చెప్పాడు. కెరీర్‌లో 11వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించాడు. 1934లో ఫ్రెడ్ పెర్రీ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను అందుకున్న తొలి బ్రిటిషర్‌గా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించేందుకు ముర్రే చేసిన ప్రయత్నాలను జొకోవిచ్ అడ్డుకున్నాడు.

ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నొవాక్ జొకోవిచ్‌ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నొవాక్ జొకోవిచ్

డబుల్ ధమాకా.. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎలెనా వెస్నినాతో కలిసి
మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించిన బ్రూనో సోరెస్ (ఎడమ). జెమీ ముర్రేతో కలిసి అతను
పురుషుల డబుల్స్ విభాగంలోనూ టైటిల్ అందుకున్నాడు