క్రీడాభూమి

లోథా కమిటీ సిఫార్సుల అమలుకు పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: జస్టిస్ ఆర్ ఎం లోథా కమిటీ సిఫార్సులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేయన్ (హెచ్‌సిఎల్) అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసును బుధవారం కోర్టు విచారణ జాబితాలో పెట్టారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్‌లతో కూడిన బెంచ్ విచారిస్తుంది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేసేలా చూడాలని కోరుతూ న్యాయవాది ఎం. గోవింద్‌రెడ్డి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. హెచ్‌సిఎల్ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు.