క్రీడాభూమి

జాతీయ బాడ్మింటన్‌కు సైనా, సింధు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఫిబ్రవరి 2: టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి సింధు గురువారం నుంచి ప్రారంభం కానున్న 81 సీనియర్ జాతీయ చాంపియన్‌షిప్స్ నుంచి వైదొలిగారు. సైనా ఇటీవలే మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో ఆమె పోర్న్‌పవీ చొచువనాను 22-20, 22-20 తేడాతో ఓడించింది. కాగా, సింధు గత వారం సయ్యద్ మోదీ స్మారక బాడ్మింటన్ టోర్నీ మహిళల ఫైనల్‌లో గ్రెగరియా మరిస్కాపై 21-13, 21-14 స్కోరుతో విజయం సాధించి టైటిల్ అందుకుంది. వీరిద్దరూ జాతీయ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనకపోవడం అభిమానులను నిరాశ పరుస్తున్నది. అయితే, డిఫెండింగ్ చాంపియన్, సయ్యద్ మోదీ స్మారక టోర్నీ పురుషుల సింగిల్స్ విజేత సమీర్ వర్మ, అతని సోదరుడు, మాజీ చాంపియన్ సౌరభ్ వర్మ, స్విస్ ఓపెన్ చాంపియన్ హెచ్‌ఎస్ ప్రణయ్ తదితరులు ఈ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

చిత్రాలు..సైనా నెహ్వాల్, పివి సింధు