క్రీడాభూమి

20కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలం ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ముందుగా చేసిన ప్రకటనను అనుసరించి ఈ వేలం శనివారం జరగాల్సి ఉంది. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే తమతమ పదవుల నుంచి వైదొలగడంతో ఐపిఎల్ వేలం ప్రక్రియ వాయిదా పడింది. కానీ, ఇటీవలే మాజీ కాగ్ వినోద్ రాయ్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, ప్రముఖ బ్యాంకర్ విక్రం లిమాయే, సుప్రసిద్ధ చరిత్రకారుడు, పాత్రికేయుడు రామచంద్ర గుహతో పాలనాధికారుల కమిటీ (సిఒఎ)ను సుప్రీం కోర్టు నియమించడంతో పాలనా పరమైన వ్యవహారాలపై నెలకొన్న అస్పష్టతకు తెరపడింది. కాగా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశం దుబాయ్‌లో జరుతుండడం, బిసిసిఐకి సంబంధించిన సమాచారాన్ని అధ్యయనం చేయడం వంటి కారణాలతో ఐపిఎల్ వేలంపై సిఒఎ దృష్టి సారించలేకపోయింది. కానీ, ఈనెల 20న ఐపిఎల్ వేలం పూర్తి చేయాలని, ముందుగా నిర్ణయించిన విధంగానే ఏప్రిల్ 5 నుంచి మే 21వ తేదీ వరకూ ఈ ఏడాది ఐపిఎల్‌ను నిర్వహించాలని సిఒఎ నిర్ణయించింది. 2018 ఐపిఎల్‌లోగా ఆటగాళ్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలకూ ఇదే చివరి అవకాశం కావడంతో, ఈ వేలం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎవరెవరిని అదృష్టం వరిస్తుందో, ఎవరికి నిరాశ తప్ప దో అన్నది ఆసక్తి రేపుతున్నది.
అత్యధికంగా 27 మంది
ఒక్కో ఫ్రాంచైజీలో అత్యధికంగా 27 మంది క్రీడాకారులు ఉండవచ్చు. ఒక్కో జట్టులో ఎక్కువలో ఎక్కువ తొమ్మిది మంది విదేశీ క్రీడాకారులకు అవకాశం ఉంటుంది. మొత్తం 60 కోట్ల రూపాయలు లేదా సుమారు 10 మిలియన్ డాలర్లను ఆటగాళ్లను కొనేందుకు ఖర్చు చేయవచ్చు. కాగా, శుక్రవారంతో రిజిస్ట్రేన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 750 మంది క్రికెటర్లు వేలానికి సిద్ధంగా ఉన్నామంటూ తమ పేర్లను నమోదు చేయించుకున్నారని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. వీరి నుంచి 76 మందిని వివిధ ఫ్రాంచైజీలు కొంటాయి.
వైదొలగిన పీటర్సన్
లండన్: ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ ఈసారి ఐపిఎల్ నుంచి వైదొలిగాడు. ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న పలు టోర్నీల్లో పాల్గొనాల్సి ఉండదని, తీరికలేని షెడ్యూల్ కారణంగా ఈ ఏడాది ఐపిఎల్‌కు హాజరుకావడం లేదని అతను ఒక ప్రకటనలో తెలిపాడు. అంతేగాక, ఏప్రిల్, మే మాసాల్లో తాను ఇంగ్లాండ్ నుంచి బయటకు వెళ్లడం లేదని, ఐపిఎల్ నుంచి వైదొలగడానికి అది కూడా ఒక కారణమని 36 ఏళ్ల పీటర్సన్ స్పష్టం చేశాడు.
ఏ ఫ్రాంచైజీకి
ఎంత మంది?
1. ఢిల్లీ డేర్ డెవిల్స్ (17 మంది/ ఐదుగురు విదేశీ క్రికెటర్లు/ చేతిలో ఉన్న మొత్తం 23.1 కోట్ల రూపాయలు), 2. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (19 మంది/ ఐదుగురు విదేశీ క్రికెటర్లు/ చేతిలో ఉన్న మొత్తం 23.35 కోట్ల రూపాయలు), 3. కోల్‌కతా నైట్ రైడర్స్ (14 మంది/ నలుగురు విదేశీ ఆటగాళ్లు/ చేతిలో ఉన్న మొత్తం 19.75 కోట్ల రూపాయలు), 4. ముంబయి ఇండియన్స్ (20 మంది/ ఆరుగురు విదేశీ క్రికెటర్లు/ చేతిలో మిగిలిన మొత్తం 11.55 కోట్ల రూపాయలు), 5. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (20 మంది/ ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు/ చేతిలో ఉన్న మొత్తం 12.82 కోట్ల రూపాయలు), 6. సన్‌రైజర్స్ హైదరాబాద్ (17 మంది/ ఐదుగురు విదేశీయులు. చేతిలో ఉన్న మొత్తం 20.9 కోట్ల రూపాయలు), 7. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ (17 మంది/ ఐదుగురు విదేశీ క్రికెటర్లు/ చేతిలో ఉన్నది 17.5 కోట్ల రూపాయలు), 8. గుజరాత్ లయన్స్ (16 మంది/ ఆరుగురు విదేశీ ఆటగాళ్లు/ చేతిలో ఉన్న మొత్తం 14.35 కోట్ల రూపాయలు).