క్రీడాభూమి

గ్లోబల్ లీగ్ వస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఫిబ్రవరి 4: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విజయవంతం కావడంతో చాలా దేశాలు అదే బాటలో నడుస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ దేశాలు ప్రీమియర్ లీగ్ టోర్నీలను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరింది. గ్లోబల్ లీగ్ పేరుతో టి-20 క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్టు క్రికెట్ దక్షిణాఫ్రికా (సిఎస్‌ఎ) ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన సిఎస్‌ఎ అధ్యక్షుడు క్రిస్ నెన్జానీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి హరూన్ లార్గట్ తమ దేశంలో టి-20 లీగ్‌కు అనుమతినివ్వాలని కోరారు. దీనికి ఐసిసి అధికారులు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఐపిఎల్‌లో మాదిరిగానే ఎనిమిది ఫ్రాంచైజీలతో గ్లోబల్ డెస్టినేషన్ లీగ్ కొనసాగనుంది. మార్చి మూడో తేదీ నుంచి బిడ్డింగ్‌ను ఆహ్వానించాలని సిఎస్‌ఎ నిర్ణయించింది. మొత్తం మీద మరో ప్రీమియర్ లీగ్ తెరపైకి రావడంతో, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రస్తుత, మాజీ క్రికెటర్లతోపాటు, ఔత్సాహిక ఆటగాళ్లకు కూడా డిమాండ్ పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది.