క్రీడాభూమి

కివీస్ మెరుపుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, ఫిబ్రవరి 5: బ్యాటింగ్‌లో రాస్ టేలర్, బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ విజృంభించడంతో, ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వనే్డను 24 పరుగుల తేడాతో గెల్చుకున్న న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. టేలర్ సెంచరీతో కదం తొక్కితే, బౌల్ట్ 33 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి, కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 281 పరుగులు సాధించింది. ఓపెనర్ టామ్ లాథమ్ పరుగుల ఖాతాను తెరవకుండానే అవుట్‌కాగా, మరో ఓపెనర్ డీన్ బ్రౌన్లీ 78 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 37 పరుగులు సాధించాడు. మిచెల్ సాంట్నర్ 38 (నాటౌట్) తప్ప మిడిల్ ఆర్డర్‌లో ఎవరూ రాణించలేకపోయారు. అయితే, కివీస్ ఇన్నింగ్స్‌కు కొండంత అండగా నిలిచిన టేలర్ 101 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతని స్కోరులో 13 బౌండరీలున్నాయి.
తనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌గా వచ్చి న కెప్టెన్ ఆరోన్ ఫించ్ (56), మిడిల్ ఆర్డర్‌లో ట్రా విస్ హెడ్ (53) అర్ధ శతకాలు సాధించగా, మార్కస్ స్టొయినిస్ 42 పరుగులు నమోదు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పరుగుల వేటలో తడబడి తక్కువ పరుగులకే వికెట్లు సమర్పించుకున్నారు. ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీసిన ట్రెంట్ బౌల్ట్ పది ఓవర్లలో కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతని విజృంభణతో ఆసీస్‌కు 24 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి వనే్డను న్యూజిలాం డ్ 6 పరుగుల తేడాతో సొంతం చేసుకున్న విష యం తెలిసిందే. రెండో వనే్డ వర్షం వల్ల రద్దయింది. సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన ఆసీస్ చివరి వనే్డలో ఓడగా, న్యూజిలాండ్ 2-0 తేడాతో సిరీస్‌ను గెల్చుకుంది.

సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 9 వికెట్లకు 281 (బ్రౌన్లీ 63, రాస్ టేలర్ 107, మిచెల్ సాంట్నర్ 38 నాటౌట్, మిచెల్ స్టార్క్ 3/63, జేమ్స్ ఫాల్క్‌నెర్ 3/59, హాజెల్‌వుడ్ 2/44).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 47 ఓవర్లలో 257 ఆలౌట్ (ఆరోన్ ఫించ్ 56, ట్రావిస్ హెడ్ 53, మార్కస్ స్టొయినిస్ 42, ట్రెంట్ బౌల్ట్ 6/33, మిచెల్ సాంట్నర్ 2/50).

చిత్రం..ఆస్ట్రేలియాపై సాధించిన వనే్డ సిరీస్ ట్రోఫీతో న్యూజిలాండ్ జట్టు సభ్యులు