క్రీడాభూమి

అనికేత్‌కు నాలుగు వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: భారత్ ‘ఎ’ ఎడమచేతి వాటం మీడియం పేసర్ అనికేత్ చౌదరి అద్భుతంగా రాణించి, 26 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టడంతో, పరుగుల కోసం నానా ఇబ్బందులు పడిన బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్లకు 224 పరుగుల స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆదివారం ప్రారంభమైన రెండు రోజుల వామప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆరంభంలోనే వికెట్లు ఓపెనర్లను కోల్పోయినప్పటికీ, ఫస్ట్‌డౌన్ ఆటగాడు సౌమ్య సర్కార్ (52), మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్/ వికెట్‌కీపర్ ముస్త్ఫాకర్ రహీం (58) అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నారు. అయితే, ఆతర్వాత అదే అదే స్థాయి పోరాటం లేకపోవడంతో, బంగ్లాదేశ్ 67 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 224 పరుగులు సాధించగలిగింది. బౌలింగ్ ప్రాక్టీస్‌ను దృష్టిలో ఉంచుకొని, అదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ ఆట ముగిసే సమయానికి కెప్టెన్ అభినవ్ ముకుంద్ (16) వికెట్‌ను నష్టపోయి 91 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంక్ పంచాల్ 40, శ్రేయాస్ అయ్యర్ 29 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

చిత్రం..అనికేత్ చౌదరి
(26 పరుగులకు
4 వికెట్లు)