క్రీడాభూమి

రొనాల్డో హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, ఫిబ్రవరి 1: రియల్ మాడ్రిడ్ తరఫున ఆడుతున్న పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి తన సత్తా చాటాడు. స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో భాగంగా ఎస్పానియల్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి, రియల్ మాడ్రిడ్‌ను విజయపథంలో నడిపించాడు. లా లిగా టోర్నీలో రొనాల్డోకు ఇది 29వ హ్యాట్రిక్. కాగా ఈ విజయంతో రియల్ మాడ్రిడ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. బార్సిలోనా మొత్తం 51 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, అట్లెటికో మాడ్రిడ్ 48 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. రియల్ మాడ్రిడ్ 47 పాయింట్లు తన ఖాతాలో చేర్చుకొని మూడో స్థానంలో ఉంది. ఎస్పానియల్‌పై హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన రియల్ మాడ్రిడ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మ్యాచ్ ఏడవ నిమిషంలోనే కరీం బెంజిమా ద్వారా తొలిగోల్‌ను అందుకున్న ఈ జట్టు మరో ఐదు నిమిషాల్లోనే రెండో గోల్‌ను సాధించింది. రొనాల్డో ఈ మ్యాచ్‌లో తొలి గోల్ చేశాడు. ఆతర్వాత కూడా అదే దూకుడును కొనసాగించాడు. 45, 82 నిమిషాల్లో అతను గోల్స్ చేయగా, జేమ్స్ రోడ్రిగెజ్ 16వ నిమిషంలో, రూబెన్ డార్టె 86వ నిమిషంలో గోల్స్ సాధించారు. రియల్ మాడ్రిడ్ విజృంభణకు అడ్డుకట్ట వేయడంపైనే ఎక్కువగా దృష్టి సారించిన ఎస్పానియల్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. హ్యాట్రిక్ సాధించడం ద్వారా ఈ సీజన్‌లో ఎక్కువగా 19 గోల్స్ చేసిన ఆటగాడిగా బార్సిలోనా హీరో లూయిస్ సౌరెజ్‌తో కలిసి రొనాల్డో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కరీం బెంజిమా 18, నేమార్ 16 గోల్స్‌తో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

టి-20 ఫార్మెట్‌లోనూ
భారత్‌కు అగ్రస్థానం

దుబాయ్, ఫిబ్రవరి 1: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న భారత్ తాజాగా టి-20 ఫార్మెట్‌లోనూ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా మొత్తం 120 రేటింగ్ పాయింట్లతో రెండు నుంచి మొదటి స్థానానికి చేరింది. ఇప్పటి వరకూ అగ్రస్థానంలో ఉన్న వెస్టిండీస్ 118 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. శ్రీలంక ఖాతాలోనూ 118 పాయింట్లు ఉన్నాయి. అయితే, లంక కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన విండీస్‌కు రెండో స్థానం దక్కింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, స్కాట్‌లాండ్ జట్లు వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి. అఫ్గాన్, స్కాట్‌లాండ్ జట్లు ర్యాంకింగ్స్‌లో ముందుకు వెళుతుంటే, టెస్టు హోదాగల బంగ్లాదేశ్ 11, జింబాబ్వే 14 స్థానాల్లో నిలవడం విచిత్రం.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకున్న భారత క్రికెట్ జట్టు