క్రీడాభూమి

బ్రాడ్‌మన్ ఇప్పుడు ఆడితే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఫిబ్రవరి 8: టెస్టు క్రికెట్‌లో అసాధారణ ప్రతిభావంతుడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను పేర్కొంటారు. సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, బ్రియాన్ లారా వంటి క్రికెటర్లు ఎన్ని రికార్డులు నెలకొల్పినా, టెస్టు క్రికెట్‌లో తిరుగులేని వీరుడిగా బ్రాడ్‌మన్‌కే అందరూ ముక్తకంఠంతో జేజేలు పలుకుతారు. కెరీర్‌లో 52 టెస్టులు (80 ఇన్నింగ్స్) ఆడిన అతను 6,996 పరుగులు చేశాడు. అంటే ప్రతి టెస్టుకూ బ్రాడ్‌మన్ సగటున 99.94 పరుగులు సాధించాడు. ఈ సగటును ఇప్పటి వరకూ మరే ఇతర క్రికెటర్ అందుకోలేదు. అతని ఖాతాలో 29 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాను ఆడిన టెస్టుల్లో సగానికంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో బ్రాడ్‌మన్ శతకాలు సాధించడం విశేషం. 234 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో, 43 పర్యాయాలు నాటౌట్‌గా నిలిచిన అతను 28,067 పరుగులు చేశాడు. 95.14 సగటుతో తనకు తిరుగులేని నిరూపించాడు. అంతేగాక, బ్యాట్స్‌మెన్‌ను, ప్రత్యేకించి తనను గాయపరచడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ ప్రవేశపెట్టిన ‘బాడీలైన్’ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. హెల్మెట్, ఆర్మ్‌గార్డ్, చెస్ట్‌గార్డ్, థై ప్యాడ్స్ వంటి రక్షణ కవచాలు ఏవీ లేని కాలంలో, నిప్పులు చిమ్ముతూ మెరుపు వేగంతో దూసుకొచ్చే బంతులను ఎలాంటి భయం లేకుండా ఎదుర్కొన్న బ్రాడ్‌మన్‌ను దమ్మున్నోడుగా చెప్తారు. అలాంటి బ్రాడ్‌మన్ ఈ రోజుల్లో క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? క్రికెట్ రూపురేఖలు కనీవినీ ఎరుగని రీతిలో మారుపోతున్న నేటి తరంలో బ్రాడ్‌మన్ క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? అతను తన స్థాయిలో రాణించగలుగుతాడా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలు వేసిన ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ రాడ్నీ హాగ్, వివాదాస్పద సమాధానాలు కూడా ఇచ్చాడు. ఒకవేళ బ్రాడ్‌మన్ ఈ తరంలో ఉంటే, టెస్టుల్లో అతనికి 99.94 పరుగుల సగటు సాధ్యమయ్యేది కాదని ఒక ఇంటర్వ్యూలో హాగ్ వ్యాఖ్యానించాడు. 1920 దశకం నుంచి 1950 దశకం వరకూ బ్యాటింగ్ చేయడం చాలా సులభంగా ఉండేదని, అప్పట్లో బౌలింగ్ గొప్పగా ఉండేది కాదని అన్నాడు. పలు గణాంకాలను కూడా అతను ఈ సందర్భంగా ప్రస్తావించాడు. 1070, 1980 దశకాల్లో బ్యాట్స్‌మెన్ సగటుల్లో పతనం మొదలైందని చెప్పాడు. 1920-1950 మధ్యకాలంలో బ్రాడ్‌మన్ సగటు 99.94కాగా, వాల్టర్ హామండ్ 58, హెర్బర్ట్ స్టట్‌క్లఫ్ 60, లెన్ హాటన్ 56, జాక్ హాబ్స్ 56 చొప్పున సగటులతో రాణించాలరి గుర్తుచేశాడు. ఆతర్వాత ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్ ఎవరికీ అలాంటి సగటు సాధ్యం కాలేదన్నాడు. గ్రాండ్ గూచ్ 42, డేవిడ్ గోవర్ 43, జెఫ్రీ బాయ్‌కాట్ 47, కెవిన్ పీటర్సన్ 47 చొప్పున సగటులను సాధించగలిగారని తెలిపాడు. టెస్టుల్లో పరుగులు సాధించడం గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా కష్టంగా మారిందని అన్నాడు. పిచ్ తీరుతెన్నులు, బౌలర్ల ప్రతిభాపాటవాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని విశే్లషిస్తే, ఒకవేళ బ్రాడ్‌మన్ ఈతరంలో ఆడితే, అతనికి తిరుగులేని సగటు పరుగులు సాధ్యమయ్యేవి కావని స్పష్టం చేశాడు. నిజానికి తనకు బ్రాడ్‌మన్ అంటే ఎంతో గౌరవం ఉందని, అతనిని గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఆరాధిస్తానని చెప్పాడు. అయితే, ఇప్పటి తరంతో అతనిని పోల్చలేమని వ్యాఖ్యానించాడు.