క్రీడాభూమి

అండర్-19 వనే్డ క్రికెట్ చివరి మ్యాచ్ టై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 8: ఇంగ్లాండ్, భారత్ అండర్-19 జట్ల మధ్య బుధవారం జరిగిన చివరి, ఐదో వనే్డ టైగా ముగిసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్, చివరి బంతిలో ఇషాన్ పొరెల్ అవుట్‌కావడంతో, విజయానికి అవసరమైన చివరి పరుగును సంపాదించడంలో విఫలమైన భారత్ మ్యాచ్‌ని టైగా ముగింది. అయితే, సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ అండర్- 19 జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 226 ప రుగులు చేసింది. జార్జిబార్ట్‌లెట్ 47, వికెట్‌కీపర్ ఒలీ పోప్ 45 పరుగులతో రా ణించారు. భారత్ అండర్-19 బౌలర్లలో ఆయుష్ జాంవాల్ 40 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ పొరెల్‌కు రెండు వికెట్లు లభించాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ అండర్-19కు రాధాకృష్ణన్ (65), ఆయుష్ జాంవాల్ (4), యష్ ఠాకూర్ (30) అండగా నిలిచారు. జట్టు స్కోరు 226 పరుగులకు చేరుకునే సమయానికి ఇషాన్ పొరెల్ 6, హెరాంబ్ పరబ్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. చివరి బంతికి ఒక పరుగు చేస్తే, భారత్ అండర్-19 గెలిచి ఉండేది. కానీ, లియామ్ పాటర్సన్ వైట్ వేసిన బంతిలో భారీ షాట్‌కు ప్రయత్నించిన ఇషాన్ పొరెల్ విఫలమయ్యాడు. మాక్స్ హోల్డెన్ చక్కటి క్యాచ్ పట్టడంతో భారత్‌కు అదే స్కోరు వద్ద ఆలౌట్‌కాగా, మ్యాచ్‌లో ఫలితం తేలకుండా టైగా ముగిసింది. అయితే, అప్పటికే మూడు విజయాలను నమోదు చేసిన భారత్ అండర్-19 జట్టుకు 3-1 ఆధిక్యంతో సిరీస్ దక్కింది.