క్రీడాభూమి

మాడిన్సన్ కోపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఫిబ్రవరి 9: ఆస్ట్రేలియా క్రికెటర్ నిక్ మాడిన్సన్‌కు కోపం వచ్చింది. కేవలం మూడు టెస్టుల్లో అవకాశం ఇచ్చిన తర్వాత ఆసీస్ క్రికెట్ జాతీయ సెలక్టర్లు అతనికి మొండి చేయి చూపించారు. దీనితో మనస్తాపం చెందిన 25 ఏళ్ల మాడిన్సన్ తాను కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించాడు. అయితే, ఎంతకాలం విశ్రాంతి తీసుకుంటాడనే విషయంపై అతను స్పష్టత ఇవ్వలేదు. గత నవంబర్‌లో మాట్ రెన్షా, పీటర్ హ్యాడ్స్‌కోమ్‌తోపాటు మాడిన్సన్‌ను టెస్టు జట్టులోకి తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దక్షిణాఫ్రికాతో హోబర్ట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ దారుణంగా ఓడిన తర్వాత, జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురు ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన అతను డకౌటయ్యాడు. అనంతరం పాకిస్తాన్‌పై మూడు ఇన్నింగ్స్‌లో కేవలం తొమ్మిది పరుగులు చేశాడు. ఈ వైఫల్యాల కారణంగానే అతను జట్టులో స్థానం కోల్పోయాడు. కాగా, జాతీయ జట్టుకు ఎంత హఠాత్తుగా ఎంపికయ్యాడో అంతే హఠాత్తుగా స్థానాన్ని కోల్పోవడంతో మనస్తాపానికి గురైన అతను గత వారం న్యూ సౌత్‌వేల్స్ తరఫున ఆడాల్సిన మ్యాచ్‌లకు డుమ్మా కొట్టాడు. క్రికెట్ నుంచి కొంతకాలం విశ్రాంతి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులపై అతను ఆగ్రహంతో ఉన్నాడని, అందుకే క్రికెట్‌కే దూరమవుతున్నాడని వాదన వినిపిస్తున్నది. అయితే, మాడిన్సన్ తన నిర్ణయంపై స్పష్టత ఇవ్వలేదు.