క్రీడాభూమి

బాధ్యత పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: వరుస విజయాలు ఎంతో ఆనందాన్నిస్తున్నాయని, వీటి వల్ల బాధ్యత మరింతగా పెరుగుతున్నదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెప్పింది. మార్టినా హింగిస్‌తో కలిసి ఇటీవలే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మెల్బోర్న్ నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా ఆమె సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ, వరుసగా మూడు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించడంలో ఉన్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. ఒక్కోసారి ఇది నిజమా లేక కలా అన్న అనుమానం వస్తుందని వ్యాఖ్యానించింది. హింగిస్‌తో కలిసి 36 వరుస విజయాలను సాధించడం కూడా గొప్ప అనుభూతినిస్తున్నదని చెప్పింది. గత ఏడాది చాల అద్భుతంగా ముగిసిందని, ఈఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్ లభించిందని తెలిపింది. ఒక సీజన్‌ను మొదలు పెట్టడానికి ఇంతకంటే మంచి విధానం మరొకటి ఉండదని పేర్కొంది. భవిష్యత్తులోనూ భారత్‌కు ఎక్కువ సంఖ్యలో టైటిళ్లను అందించాలన్నదే తన లక్ష్యమని తెలిపింది. గత ఏడాది వింబు ల్డన్, యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్ టైటిళ్లను సాధించిన సానియా, అదే ఒరవ డిని ఈఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ కొనసాగించింది. సాంటినాగా పేరు తెచ్చుకున్న ఈ జోడీ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.