క్రీడాభూమి

ఫైనల్ చేరిన పాకిస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 11: అంధుల టి-20 ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్లు మరోసారి టైటిల్ కోసం యుద్ధానికి సిద్ధమయ్యాయి. మొదటి సెమీ ఫైనల్‌లో శ్రీలంకను పది వికెట్లతో చిత్తుచేసిన భారత్ ఫైనల్‌లో స్థానం సంపాదించగా, శనివారం నాటి రెండో సెమీస్‌లో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల ఆధిక్యంతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. శ్రీలంకపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచిన భారత్ తన ప్రత్యర్థిని 19.2 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ చేసింది. సురంగ సంపత్ 49 పరుగులు చేసి రనౌట్‌కాగా, చందన్ దేశ్‌ప్రియ 42 పరుగులు సాధించాడు. మిగతా వారు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రణ్‌బిర్ పన్వర్ 29 పరుగులకు రెండు, సునిల్ 21 పరుగులకు రెండు చొప్పున వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని చేరింది. ప్రకాశ్ 52 బంతుల్లో 115, అజయ్ కుమార్ రెడ్డి 30 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు.
బాబర్, ఇస్రార్ సెంచరీలు
ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో పాక్ సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు బాబర్ మునీల్, ఇస్రార్ హసన్ శతకాలతో రాణించి అండగా నిలిచారు. వీరిద్దరి విజృంభణతో ఆ జట్టు 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టానికి 309 పరుగుల భారీ స్కోరు సాధించింది. బాబర్ 43 బంతులు ఎదుర్కొని, 18 ఫోర్లతో 103 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 226 పరుగులు. అమీర్ ఇష్ఫాక్ 26 పరుగులు చేసి రనౌట్‌కాగా, 20 ఓవర్లు ముగిసే సమయానికి మాటీ ఉల్లా (20 నాటౌట్)తో కలిసి ఇస్రార్ క్రీజ్‌లో ఉన్నాడు. అతను 69 బంతులు ఎదుర్కొని 143 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 25 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
పాక్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ పరుగుల వేటలో విఫలమైంది. రనౌటైన మాథ్యూ ఓపెనర్ మాథ్యూ జేమ్స్ 36 బంతుల్లో 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండో అత్యధిక స్కోరు, 35 పరుగులు ఎక్‌స్ట్రాల రూపంలో వచ్చినవే. ఇంగ్లాండ్ బ్యాట్‌మెన్ మితిమీరిన డిఫెన్స్‌ను ప్రదర్శించడంతో, 20 ఓవర్లలో ఆ జట్టు ఏడు వికెట్లకు 162 పరుగులు చేయగలిగింది.
ఇలావుంటే, 2012లో జరిగిన మొదటి అంధుల టి-20 ప్రపంచ కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను 29 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ సాధించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో మరోసారి ఈ రెండు జట్లు తలపడనున్నాయి.