క్రీడాభూమి

ప్రొఫెషనల్ కెరీర్‌పై వికాస్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్‌ను ఎంచుకోవడం విజేందర్ సింగ్‌తో మొదలై, నిరాటంకంగా కొనసాగుతున్నది. భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) మద్దతుతో తాను కూడా ప్రొఫెషనల్‌గా మారాలని ఆలోచిస్తున్నట్టు ఆసియా క్రీడల మాజీ స్వర్ణ పతక విజేత, రెండు పర్యాయాలు ఒలింపిక్స్‌లో పోటీపడిన వికాస్ కిషన్ ప్రకటించాడు. ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో శిక్షణ పొందుతున్న అతను సోమవారం అక్కడి నుంచి ఫోన్‌లో పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఎదగడమే తన లక్ష్యమని అన్నాడు. దీనికోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని చెప్పాడు. బిఎఫ్‌ఐ ఆమోదం తెలిపితే, ప్రొఫెషనల్‌గా కెరీర్‌ను మొదలుపెడతానని అన్నాడు.