క్రీడాభూమి

కివీస్-దక్షిణాఫ్రికా వన్‌డే మ్యాచ్ వేదిక మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 14: నేపియర్‌లో వచ్చే నెల దక్షిణాఫ్రికాతో జరగాల్సిన నాలుగో వన్‌డే మ్యాచ్‌కి వేదిక అయిన మెక్‌లీన్ పార్క్ మైదానంలో డ్రైనేజి వ్యవస్థ సరిగా లేని కారణంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆ మ్యాచ్ వేదికను హామిల్టన్‌కు మార్చింది. వర్షం కారణంగా ఈ మైదానంలో అవుట్‌ఫీల్డ్ బురదగా ఉన్న కారణంగా ఈ నెల ప్రారంభంలో న్యూజిలాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్‌డే మ్యాచ్ రద్దయిందని, మరోసారి అలాంటిది జరక్కుండా ఉండడం కోసమే వేదికను మార్చినట్లు న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆండ్రూ క్రమీ చెప్పాడు. అందుకనే మార్చి 1న న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన నాలుగో వన్‌డే వేదికను హామ్లిటన్‌లోని సెడాన్ పార్కుకు మార్చినట్లు ఆయన చెప్పాడు. న్యూజిలాండ్‌తో ఒక టి-20 మ్యాచ్ తర్వాత అయిదు వన్‌డే మ్యాచ్‌లు, మూడు టెస్టులు ఆడడం కోసం దక్షిణాఫ్రికా జట్టు ఈ వారం ప్రారంభంలో న్యూజిలాండ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.