క్రీడాభూమి

ముంబయి చిన్నోడికి సిఎం టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 14: ముంబయిలోని హిల్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న కుష్ భగత్‌కు ప్రపంచ చదరంగ సమాఖ్య (ఫైడ్) మంగళవారం క్యాండిడేట్ మాస్టర్ (సిఎం) టైటిల్‌ను ప్రదానం చేసింది. భగత్ గత ఆరు నెలల నుంచి వివిధ ప్రముఖ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చి సత్తా చాటుకోవడంతో అతడిని ఈ టైటిల్ వరించింది. గత ఏడాది అండర్-7 మహారాష్ట్ర స్టేట్ చాంపియన్‌షిప్ టైటిల్‌తో జైత్రయాత్ర ప్రారంభించిన భగత్ ఆ తర్వాత రష్యాలోని సోచిలో జరిగిన వరల్డ్ స్కూల్స్ అండర్-7 బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా ఆవిర్భవించడంతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో జరిగిన వెస్ట్రన్ యూత్ చాంపియన్‌షిప్-2016 తొలి ఎడిషన్‌లో మూడు పసిడి పతకాలను కైవసం చేసుకున్నాడు. యుఎఇలో భగత్ అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటుకుని అందరినీ ఆకట్టుకోవడంతో అంతర్జాతీయ చదరంగ సమాఖ్య అతడిని క్యాండిడేట్ మాస్టర్ టైటిల్‌తో సత్కరించింది. ఈ టైటిల్‌ను పొందేందుకు అన్నివిధాలా అర్హుడైన భగత్ మున్ముందు తన అద్భుత ప్రదర్శనతో మరిన్ని గొప్ప విజయాలను అందుకోవడం ఖాయమని అతని కోచ్ గుత్తుల బాలాజీ విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.