క్రీడాభూమి

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హారిక బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్ (ఇరాన్), ఫిబ్రవరి 14: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో ‘తెలుగు తేజం’ ద్రోణవల్లి హారిక శుభారంభాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్‌లో నాలుగో సీడ్ గ్రాండ్ మాస్టర్‌గా బరిలోకి దిగిన హారిక తొలి రౌండ్ పోరులో బంగ్లాదేశ్‌కు చెందిన షమీమా అక్తర్ లిజాను మట్టికరిపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మొత్తం 64 మంది క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ నాకౌట్ టోర్నమెంట్‌లో హారికకు తొలి రౌండ్‌లోనే ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురవడం గమనార్హం. తొలి రౌండ్‌లో షమీమా తీవ్రంగా ప్రతిఘటించడంతో నిర్దేశిత సాధారణ సమయంలో విజయం సాధించలేకపోయిన హారిక టైబ్రేక్ గేమ్స్‌లో 1.5-0.5 తేడాతో విజయం సాధించింది.