క్రీడాభూమి

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌లకు గుప్టిల్ దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 15: ఇటీవల కాలంలో చక్కటి ఫామ్‌ను కొనసాగిస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ కండరాలు బెణకడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం అనివార్యమైంది. దీనితో అతను దక్షిణాఫ్రికాతో ఈనెల 17న జరిగే ఏకైక టి-20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ టూర్‌లో దక్షిణాఫ్రికా ఐదు వనే్డలు, మరో మూడు టెస్టులు కూడా ఆడుతుంది. కాగా, టి-20తోపాటు రెండుమూడు వనే్డ మ్యాచ్‌ల్లోనూ గుప్టిల్ ఆడే అవకాశాలు లేవని న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సి) ప్రకటించింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు 17న ఏకైక టి-20, అనంతరం ఈనెల 19 (హామిల్టిన్), 22 (క్రైస్ట్‌చర్చి), 25 (వెల్టింగ్టన్), మార్చి 1 (హామిల్టిన్), 4 (ఆక్లాండ్) తేదీల్లో వనే్డ మ్యాచ్‌లు ఆడతాయి. మొదటి టెస్టు మార్చి 8 నుంచి 12 వరకూ డ్యునెడిన్‌లో ఉంటుంది. రెండో టెస్టు 16 నుంచి 20 వరకు వెల్టింగ్టన్‌లో, చివరిదైన మూడో టెస్టు 25 నుంచి 29 వరకు హామిల్టన్‌లో జరుగుతాయి.