క్రీడాభూమి

ఫెరారియో సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, ఫిబ్రవరి 15: అండర్-19 యూత్ క్రికెట్ టెస్టులో ఇంగ్లాండ్‌తో తలపడుతున్న భారత్‌ను డారిల్ ఫెరారియో అద్భుత శతకంతో ఆదుకున్నాడు. అతని కృషి ఫలితంగా ప్రత్యర్థికి భారత్ బలమైన సమాధానం ఇవ్వగలిగింది. టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 501 పరుగుల భారీ స్కోరువద్ద ఇంగ్లాండ్ డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్, మ్యాచ్ రెండో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆటను కొనసాగించి, మరో ఇరవై పరుగులు జత కలిసిన తర్వాత కెప్టెన్ జాంటీ సిద్ధు (33) వికెట్‌ను కోల్పోయింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి, క్రీజ్‌లో నిలదొక్కుకొని సెంచరీ దిశగా అడుగులు వేసిన సౌరభ్ సింగ్ ఎవరూ ఊహించని విధంగా హెన్రీ బ్రూక్స్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. 137 బంతులు ఆడిన అతను 11 ఫోర్లతో 62 పరుగులు సాధించాడు. ఆర్‌ఐ ఠాకూర్ (31), వికెట్‌కీపర్ లోకేశ్వర్ (22), కనిష్క్ సేథ్ (4) భారీ స్కోర్లు చేయలేకపోయారు. అయితే, జట్టుకు అండగా నిలిచి, 228 నిమిషాలపాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన డారిల్ ఫెరారియో శతకాన్ని పూర్తి చేశాడు. అతను 228 నిమిషాల తన మారథాన్ ఇన్నింగ్స్‌లో 173 బంతులు ఎదుర్కొని, 14 ఫోర్ల సాయంతో 117 పరుగులు సాధించిన తర్వాత హెన్రీ బ్రూక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.చివరిలో సైమన్ జోసెఫ్ (62 నాటౌట్), వినీత్ పన్వార్ (4) మరో వికెట్ కూలకుండా స్కోరు ను 431 పరుగులకు చేర్చారు. అప్పటికి ఐదు వికెట్లు కూలా యి. ఇదే స్కోరువద్ద కెప్టెన్ జాంటీ సిద్ధు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. కాగా, 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 23 పరుగుగులు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ అండర్-19 మొదటి ఇన్నింగ్స్: 131.1 ఓవర్లలో 5 వికెట్లకు 501 డిక్లేర్డ్ (మాక్స్ హోల్డెన్ 170, జార్జి బార్ట్‌లెట్ 179, డెల్‌రే రాలిన్స్ 70 నాటౌట్, కనిష్క్ సేథ్ 2/85).
భారత్ అండర్-19 మొదటి ఇన్నింగ్స్: 122 ఓవర్లలో 8 వికెట్లకు 431 డిక్లేర్డ్ (అభిషేక్ గోస్వామి 66, సౌరభ్ సింగ్ 62, డారిల్ ఫెరారియో 117, సైమన్ జోసెఫ్ 62 నాటౌట్, హెన్రీ బ్రూక్స్ 2/75, లియామ్ పాటెర్సన్ వైట్ 2/104, యూసన్ ఉడ్స్ 2/55).
ఇంగ్లాండ్ అండర్-19 రెండో ఇన్నింగ్స్: 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 (హెన్రీ బ్రూక్స్ 15 నాటౌట్).

చిత్రం..సెంచరీ వీరుడు డారిల్ ఫెరారియో