క్రీడాభూమి

విండీస్, జింబాబ్వే మ్యాచ్‌లో మన్కడింగ్ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టగాంగ్, ఫిబ్రవరి 2: అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్ వివాదం తలెత్తింది. బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ ఒకవేళ క్రీజ్ నుంచి బయటకు వస్తే, సదరు బౌలర్ బంతితో వికెట్లను కొట్టడాన్ని ‘మన్కడింగ్’ అంటారు. భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ తొలిసారి ఈ విధానాన్ని అనుసరించాడు. కాగా, అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో మన్కడింగ్ యాంటీ క్లైమాక్స్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 226 పరుగులు సాధించి, క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. షమార్ స్ప్రింగర్ 61 పరుగులతో రాణించగా, జింబాబ్వే బౌలర్ రుగారే మగారిరా 28 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే చివరి ఓవర్ మొదలయ్యే సమయానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. విజయానికి మరో మూడు పరుగులు మాత్రమే చేయాల్సిన స్థితిలో ఉన్న జింబాబ్వే గెలుపు ఖాయంగా కనిపించింది. అయితే, ఆ ఓవర్ మొదటి బంతిని వేయడానికి సిద్ధమైన కీమో పాల్ రనప్‌ను మొదలు పెట్టిన తర్వాత నాన్‌స్ట్రయికింగ్ ఎండ్ బ్యాట్స్‌మన్ రిచర్డ్ గరావా క్రీజ్‌ను వదలి ముందుకు వెళ్లడాన్ని గమనించాడు. వెంటనే బంతితో బెయిల్స్‌ను తొలగించాడు. నిబంధనల ప్రకారం గరావా రనౌటైనట్టు థర్డ్ అంపైర్ ప్రకటించగా, విండీస్ ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని జింబాబ్వే క్రికెటర్లు, అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. మన్కడింగ్ చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌ని విండీస్ రెండు పరుగుల తేడాతో గెల్చుకుంది. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 వికెట్ల ఆధిక్యంతో స్కాట్‌లాండ్‌ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్‌లాండ్ 45.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. హారిస్ మెక్‌క్రీత్ అత్యధికంగా 29 పరుగులు చేశాడు. దయాన్ గలియెమ్, వియాన్ ముల్డర్, సియాన్ వైట్‌హెడ్ తలా 16 పరుగులిచ్చి, ఒక్కొక్కరూ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా వికెట్ నష్టం లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. కేల్ వెరెన్, లియామ్ స్మిత్ అజేయంగా చెరి 64 పరుగులు చేయడం గమనార్హం.

చిత్రం... క్వార్టర్స్ చేరిన విండీస్ ఆటగాళ్ల ఆనందం