క్రీడాభూమి

బౌలర్లకు విరాట్ పూర్తి స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఫీల్డింగ్‌లో మార్పులుచేర్పుల నుంచి బంతి దిశ, వేగాన్ని నిర్దేశించుకునే వరకూ బౌలర్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తి స్వేచ్ఛనిస్తాడని భారత పే సర్ ఉమేష్ యాదవ్ అన్నాడు. శుక్రవారం అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోహ్లీను బౌలర్ల పక్షపాతిగా అభివర్ణించాడు. సమయానుకూలంగా వ్యూహాల్లో మార్పులను బౌలర్లు కోరుకున్నప్పుడు కోహ్లీ సానుకూలంగా స్పందిస్తాడని చెప్పాడు. ఆస్ట్రేలియాపై రాణిస్తానని అతను ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ధీమా వ్యక్తం చేశాడు. గంటకు సమారు 140 కిలోమీటర్ల వేగంతో అవుట్ స్వింగర్స్ సంధించగలనని చెప్పాడు. కొంతకాలంగా ఇన్‌స్వింగర్స్ వేసేందుకు ప్రయత్నిస్తు న్నానని తెలిపాడు. సుమారు ఏడాదికాలంగా చేస్తున్న కృషి ఫలిస్తున్నదన్నాడు.
గుజరాత్ లయన్స్ అసిస్టెంట్ కోచ్‌గా కైఫ్
భారత మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ కైఫ్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు గుజరాత్ లయన్స్ అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. అతని అనుభవం ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది.

చిత్రం..ఉమేష్ యాదవ్