క్రీడాభూమి

రేసులో శ్రీజేష్, హర్మన్‌ప్రీత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఫిబ్రవరి 21: అంతర్జాతీయ వార్షిక హాకీ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది. ఉత్తమ ఆటగాళ్లు, గోల్‌కీపర్లు, రైజింగ్ స్టార్లు, కోచ్‌లు, అంపైర్ల ప్రతిభను గుర్తించి వారిని సత్కరించేందుకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) గురువారం చండీగఢ్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్యతో పాటు హాకీ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 2016 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన హాకీ స్టార్లకు అవార్డులను ప్రకటించడంతో పాటు విజేతలకు తొలిసారి లాంఛనంగా బహుమతులను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులకు వేర్వేరు కేటగిరీల్లో పోటీపడుతున్న భారతీయుల్లో జాతీయ హాకీ జట్టు కెప్టెన్ పిఆర్.శ్రీజేష్, ఫాస్ట్ రైజింగ్ డ్రాగ్-్ఫ్లకర్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఉన్నారు. శ్రీజేష్ ఉత్తమ గోల్‌కీపర్ అవార్డు కోసం రేసులో నిలవగా, 18 ఏళ్ల యువ ఆటగాడైన హర్మన్‌ప్రీత్ సింగ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం పోటీ పడుతున్నాడు. శ్రీజేష్ నేతృత్వంలోని భారత జట్టు గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో రజత పతకాన్ని గెలుచుకోవడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం విదితమే. కాగా, గత ఏడాది లక్నోలో జరిగిన జూనియర్ల ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలవడంలో హర్మన్‌ప్రీత్ సింగ్ ముఖ్య భూమిక పోషించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన హాకీ ఆటగాళ్లకు ఎఫ్‌ఐహెచ్ ఎన్నో ఏళ్ల నుంచి అవార్డులను ప్రదానం చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం జరుగనున్న కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని యూట్యూబ్ చానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుండటమే ఈ ప్రత్యేకత. ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో ఈ అవార్డుల కోసం పోటీపడుతున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తమ క్రీడాకారుడి అవార్డు కోసం..
గొంజాలో పిల్లట్ (అర్జెంటీనా), జాన్ డోమెన్ (బెల్జియం), మోరిట్జ్ ఫర్‌స్తే (జర్మనీ), పెడ్రో ఇబర్రా (అర్జెంటీనా), తొబియాస్ హౌకే (జర్మనీ).
ఉత్తమ మహిళా క్రీడాకారిణి అవార్డు కోసం..
అలెక్స్ డన్సన్ (బ్రిటన్), కార్లా రెబెచ్చి (అర్జెంటీనా), కేట్ రిచర్డ్‌సన్-వాల్ష్ (బ్రిటన్), నవోమీ వాన్ (నెదర్లాండ్స్), స్టాసీ మిచెల్‌సెన్ (న్యూజిలాండ్).
ఉత్తమ గోల్‌కీపర్ అవార్డు కోసం..
పిఆర్.శ్రీజేష్ (్భరత్), డేవిడ్ హార్టే (ఐర్లాండ్), జాప్ స్టాక్‌మన్ (నెదర్లాండ్స్), జువాన్ వివాల్డీ (అర్జెంటీనా), వినె్సంట్ లోరెంజో (బెల్జియం).
ఉత్తమ మహిళా గోల్‌కీపర్ అవార్డు కోసం..
బెలెన్ సుసీ (అర్జెంటీనా), జాకీ బ్రిగ్స్ (అమెరికా), జాయ్‌సీ సొంబ్రోయెక్ (నెదర్లాండ్స్), క్రిస్టినా రెనాల్డ్స్ (జర్మనీ), మాడీ హించ్ (బ్రిటన్).
రైజింగ్ స్టార్ అవార్డు కోసం..
హర్మన్‌ప్రీత్ సింగ్ (్భరత్), ఆర్థర్ వాన్ డోరెన్ (బెల్జియం), క్రిస్ట్ఫోర్ రర్ (జర్మనీ), జోరిట్ క్రూన్ (నెదర్లాండ్స్), టిమ్ హెర్జ్‌బ్రచ్ (జర్మనీ).
మహిళా రైజింగ్ స్టార్ అవార్డు కోసం..
ఫ్లోరెన్సియా హబిఫ్ (అర్జెంటీనా), కాథరిన్ స్లట్టెరీ (ఆస్ట్రేలియా), లిలీ ఆస్లీ (బ్రిటన్), మరియా గ్రనట్టో (అర్జెంటీనా), నికీ లోరెంజ్ (జర్మనీ).
ఉత్తమ కోచ్ అవార్డు కోసం..
కార్లోస్ రెటెగీ (అర్జెంటీనా), డానీ కెర్రీ (బ్రిటన్), షేన్ మిక్‌లియోడ్ (న్యూజిలాండ్).
ఉత్తమ మహిళా కోచ్ అవార్డు కోసం..
అలిసన్ అన్నన్ (ఆస్ట్రేలియా), జానె్నకీ స్కోప్‌మన్ (అమెరికా), కరెన్ బ్రౌన్ (బ్రిటన్).

చిత్రాలు. .శ్రీజేష్* హర్మన్‌ప్రీత్ సింగ్