క్రీడాభూమి

కళతప్పిన ఆస్ట్రేలియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 22: ఒకప్పటి ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు లేదు. నాటి హేమాహేమీలకు సాటిరాగల వారు కనిపించకపోవడంతో కళతప్పింది. సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ వంటి క్రికెటర్ల కోసం ఆసీస్ ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తునే ఉంది. కానీ, ఆ స్థాయి క్రికెటర్లను ప్రపంచానికి అందించలేకపోయింది. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ బ్రాడ్‌మన్‌ది సుపరచితమైన పేరు. వెస్టిండీస్ లెజెండరీ ఆల్‌రౌండర్ గారీ సోబర్స్, భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ తదితరుల కంటే ముందే బ్రాడ్‌మన్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. 99.94 సగటుతో నెలకొల్పిన టెస్టు రికార్డును ఎవరైనా అధిగమిస్తారనుకోవడం పగటి కలే అవుతుంది. ఒకే ప్రత్యర్థిపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా అతని పేరు రికార్డు పుస్తకాల్లో చేరి, అక్కడే పదిలంగా ఉంది. ఇంగ్లాండ్‌పై అతను 5,028 పరుగులు చేశాడు. ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు (974), ఒకే సెషన్‌లో ఎక్కువ పర్యాయాలు సెంచరీ చేసిన రికార్డు సైతం బ్రాడ్‌మన్ పేరుమీదే ఉంది. అతను లంచ్ విరామానికి ముందు ఒకసారి, భోజనం-టీ విరామానికి మధ్య సమయంలో రెండుసార్లు, టీ నుంచి ఆట ముగిసే సమయంలో మూడు పర్యాయాలు చొప్పున మొత్తం ఆరు శతకాలు నమోదు చేశాడు. నేటి ఆస్ట్రేలియా జట్టులో ఇలాంటి బ్యాట్స్‌మన్‌ను ఊహించలేం. మొత్తం మీద ప్రపంచ క్రికెట్‌ను శాసించి, తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆస్ట్రేలియా ఇటీవల కాలంలో అనూహ్యంగా పతనమైంది. తమదే ఎదురులేదన్న జట్టన్న ధీమా ఒకవైపు, ఎవరికి వారే తమతమ వ్యక్తిగత రికార్డులు, ఆధిపత్యం కోసం పోరాడడమే తప్ప జట్టు మొత్తం ఒకటేనన్న ధ్యాస లేకపోవడం మరోవైపు ఆసీస్ పతనాన్ని శాసిస్తున్నాయి. వీటికితోడు నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం, డబ్బుకు ఎక్కడలేని ప్రాధాన్యతనిస్తూ, గాయాలను సైతం లెక్కచేయకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వంటి టోర్నీల్లో పాల్గొనడం వంటి అంశాలు ఆస్ట్రేలియాను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. టి-20 ఫార్మాట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్న క్రికెటర్లు ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. ఇక పొగరుబోతులు, తాగుబోతులకు ఆసీస్ జట్టులో కొదువ లేదు. ఆస్ట్రేలియా 2013లో భారత్‌లో పర్యటించినప్పుడు, అప్పటి కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌తో విభేదించిన షేన్ వాట్సన్ వేటుకు గురయ్యాడు. జేమ్స్ పాటిన్సన్, మిచెల్ జాన్సన్, ఉస్మాన్ ఖాజాలపైనా క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీరిలో మిగతా ముగ్గురు సిఎకు క్షమాపణ చెప్పి, భారత్‌లోనే ఉండిపోతే, వాట్నన్ మాత్రం స్వదేశానికి చెక్కేశాడు. ఆ జట్టు పరిస్థితి ఏమిటని చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
పట్టులేని కెప్టెన్లు!
ఆస్ట్రేలియా జట్టులో ఇప్పటి కెప్టెన్లకు మిగతా ఆటగాళ్లపై పట్టుదలేదని స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే, రికీ పాంటింగ్ వరకూ కెప్టెన్లు కొంతవరకైనా ఆటగాళ్లను అదుపులో పెట్టారు. కానీ, అతని తర్వాత క్లార్క్‌గానీ, ప్రస్తుత కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌గానీ ఆ స్థాయిలో జట్టును ఒక తాటిపై నడిపించలేకపోతున్నారు. అసలు ఆసీస్ క్రికెటర్లంటేనే విశృంఖలత్వానికి, అరాచకత్వానికి, ప్రమశిక్షణా రాహిత్యానికీ మారుపేరు. వారు ఎవరికీ భయపడరు. చివరికి ఆసీస్ క్రికెట్ బోర్డుకు కూడా వారు తలవంచరు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా క్రికెటర్లకు అభిమానులంటే గౌరవం లేదా ఆపేక్ష ఉంటుంది. అదీ కాకపోతే, భుజాలకెత్తుతున్న వారే నేలకు విసిరికొడతారేమోనన్న భయమైనా ఉంటుంది. ఆసీస్ క్రికెటర్లకు మాత్రం అభిమానులంటే లక్ష్యం లేదు. కాంట్రాక్టులు పోతాయన్న భయం వారికి లేదు. జాతీయ జట్టులో స్థానం దక్కదన్న ఆందోళన అంతకంటే లేదు. ఐపిఎల్ వంటి టోర్నీల్లో, ఒకటిరెండు సీజన్లు ఆడితే, అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో సంపాదించలేంత మొత్తాలతో జేబులు నింపేసుకోవచ్చు. దీనికితోడు, స్వదేశంలోనే ఆసీస్ ఆటగాళ్లకు బిగ్ బాష్ లీగ్ ఉంది. బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లు జరుగుతున్నాయి. ఇక ఇంగ్లీష్ కౌంటీలకు ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రాతినిథ్యం దశాబ్దాలుగా కొనసాగుతునే ఉంది. ఈ కారణాలతోనే కెరీర్ ఏమవుతుందోనన్న ఆందోళన ఆసీస్ క్రికెటర్లలో కనిపించడం లేదు. ఐపిఎల్ వంటి టోర్నీల వల్ల క్రికెట్‌లో ప్రమాణాలు దిగజారిపోతున్నాయని, ఆటగాళ్లు జాతీయ సేవలకు అందుబాటులో లేకుండా పోతున్నారని సిఎ వాపోతున్నది. కానీ పట్టించుకుంటున్న వారే లేరు. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయాలు ఆసీస్ ఆటగాళ్ల ప్రమాణాలపై అనుమానాలకు తావిస్తున్నాయి.