క్రీడాభూమి

స్పిన్ మైదానాల్లో ‘కంగారూ’ల వేట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు పేసర్లు.. ముగ్గురు స్పిన్నర్లు!
పుణే: ఆస్ట్రేలియాతో గురువారం నుంచి మొదలయ్యే మొదటి టెస్టులో భారత జట్టు ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగవచ్చని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అశ్విన్, జడేజా తుది జట్టులో స్థానం సంపాదించడం ఖాయంగా కనిపిస్తున్నది. వీరితోపాటు మరో స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను కూడా జట్టులోకి తీసుకుంటారన్న వాదన వినిపిస్తున్నది. గాయం నుంచి ఇంకా కోలుకోని అమిత్ మిశ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా అందుబాటులో ఉంటాడు.

పుణే, ఫిబ్రవరి 22: స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆస్ట్రేలియాను వేటాడేందుకు కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో చిత్తుచేసి, అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టును తన ఖాతాలో వేసుకున్న టీమిండియాకు ‘కంగారూ’లు ఎంత వరకు అడ్డుకట్ట వేయగలుగుతారన్నది అనుమానమే. పరాజయం అన్నది లేకుండా వరుసగా 19 మ్యాచ్‌లను పూర్తి చేసిన టీమిండియా గురువారం నుంచి ఇక్కడ మొదలయ్యే మొదటి టెస్టులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. నాలుగు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో హోం గ్రౌండ్ అడ్వెంటేజీని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నది. న్యూజిలాండ్‌ను 3-0, ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో ఓడించిన భారత్ ఆతర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులోనూ గెలిచింది. ఆసీస్‌పైనా అదే స్థాయిలో విరుచుకుపడి, సిరీస్‌ను ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా ఆరు టెస్టు సిరీస్‌లను సాధించిన కోహ్లీ బృందం ఏడో సిరీస్‌పై కనే్నసింది. ఆస్ట్రేలియాను ఓడించి, సిరీస్‌ను అందుకోవడం సులభం కాకపోయినా, అసాధ్యం మాత్రం కాదు. భారత్‌లోని దాదాపు అన్ని స్టేడియాల్లోనూ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లే ఉంటాయన్నది వాస్తవం. ఇటీవల జరిగిన టెస్టుల్లో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పడగొట్టిన వికెట్లే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. గత 13 టెస్టుల్లో అశ్విన్ 78 వికెట్లు సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకు మించి వికెట్లు సాధించిన సందర్భాలు ఎనిమిది ఉన్నాయి. ఒక్కో వికెట్‌కు సగటున అతను ఇచ్చిన పరుగులు 24 మాత్రమే. జడేజా సైతం పొదుపుగా బౌలింగ్ చేశాడు. 10 టెస్టుల్లో అతను 25 పరుగుల సగటుతో 49 వికెట్లు కూల్చాడు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లపై భారత్ తిరుగులేని విజయాలను నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించిన వీరిద్దరూ ఆస్ట్రేలియాపైనా విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదు. విజయాలు సాధించిన జట్టులో ఎలాంటి మార్పు లేకుండా మళ్లీమళ్లీ బరిలోకి దించడం సాధ్యం కావడం లేదని చెప్పిన భారత కోచ్ అనిల్ కుంబ్లే, ఇదీ ఒక రకంగా జట్టుకు ఉపయోగపడిందని వ్యాఖ్యానించాడు. అతని మాటల్లో నిజం లేకపోలేదు. ఒక ఆటగాడు గాయపడితే, అతని స్థానంలో వచ్చిన ఆటగాడు తనను తాను నిరూపించుకోవడానికి శక్తివంచన లేకుండా శ్రమించడంతో, కోహ్లీకి వివిధ రకాల ఆప్షన్లు చేతిలో ఉంటున్నాయి. కోహ్లీ, అశ్విన్, జడేజాతోపాటు నిలకడగా రాణిస్తున్న భారత ఆటగాళ్లలో మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా
కూడా
ఉన్నారు.
భారత జట్టు 2012-13 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన నాలుగో టెస్టును చేజార్చుకున్న తర్వాత ఇప్పటి వరకూ స్వదేశంలో పరాజయాన్ని చవిచూడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ భారత్ సొంత గడ్డపై 20 టెస్టులు ఆడింది. 17 విజయాలు సాధించింది. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఆసీస్‌పై భారత్‌కు విజయావకాశాలు ఉన్నాయనడానికి ఈ గణాంకాలు కూడా ఉపయోగపడతాయి. కాగా, 2004-05 సీజన్‌లో భారత్‌లో పర్యటించినప్పుడు ఆస్ట్రేలియా సిరీస్‌ను గెల్చుకుంది. అంతకు ముందు ఆ జట్టుకు 1969-70 సీజన్‌లో భారత్‌పై భారత్‌లోనే సిరీస్ దక్కింది. అంటే, సుమారు మూడున్నర దశాబ్దాలు కృషి చేస్తేగానీ టీమిండియాను భారత్‌లో ఆసీస్ ఓడించలేకపోయింది. సుమారు పుష్కర కాలం క్రితం భారత్‌లో టెస్టు సిరీస్‌ను గెల్చుకున్న ఆస్ట్రేలియా మరోసారి అదే ఫీట్‌ను ప్రదర్శించేందుకు ఇంకెనే్నళ్లు వేచిచూడాల్సి ఉంటుందో!