క్రీడాభూమి

డోమెన్, నవోమీలకు ఎఫ్‌ఐహెచ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఫిబ్రవరి 23: బెల్జియం కెప్టెన్, ఒలింపిక్ రజత పతక విజేత జాన్-జాన్ డొమెన్, నెదర్లాండ్స్ క్రీడాకారిణి నవోమీ వాన్ ఆస్‌లకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అవార్డులు లభించాయి. 2016 ఏడాదికిగాను, పురుషుల విభాగంలో డోమెన్, మహిళల విభాగంలో నవోమీలకు ఈ అవార్డులు దక్కాయి. ఉత్తమ ఆటగాళ్లతోపాటు ఉత్తమ గోల్‌కీపర్లు, రైజింగ్ స్టార్స్, కోచ్‌లు, అంపైర్ల విభాగాల్లోనూ ఎఫ్‌ఐహెచ్ మొట్టమొదటిసారి అవార్డులను ప్రదానం చేయడం విశేషం. భారత కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ ఉత్తమ గోల్‌కీపర్‌గా, హర్మన్‌ప్రీత్ సింగ్ ఉత్తమ రైజింగ్ స్టార్‌గా అవార్డు కోసం రేసులో ఉన్నప్పటికీ ఫలితం దక్కలేదు. అత్యుత్తమ గోల్‌కీపర్‌గా ఐర్లాండ్‌కు చెందిన డేవిడ్ హార్ట్ వరుసగా రెండోసారి అవార్డు దక్కించుకోవడంతో శ్రీజేష్‌కు నిరాశ తప్పలేదు. మహిళల విభాగంలో ఉత్తమ గోల్‌కీపర్‌గా మాడీ హిన్చ్ (గ్రేట్ బ్రిటన్) ఎంపికైంది. మేల్ రైజింగ్ స్టార్ అవార్డును ఆర్థర్ వాన్ డోరెన్ (బెల్జియం) స్వీకరించాడు. మహిళల విభాగంలో రైజింగ్ స్టార్ అవార్డు అర్జెంటీనాకు చెందిన మరియా గ్రానాటోకు లభించింది.

చిత్రాలు..జాన్-జాన్ డొమెన్, నవోమీ వాన్ ఆస్