క్రీడాభూమి

జర్మన్ ఓపెన్ బాడ్మింటన్‌లో శ్రీకాంత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్హెయిమ్ ఆండెర్ రర్ (జర్మనీ), మార్చి 1: జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత టాప్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన పోరాటాన్ని అద్భుత రీతిలో ప్రారంభించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అతను వరుస గేముల తేడాతో స్లొవేకియాకు చెందిన అలెన్ రోజ్‌ను మట్టికరిపించి శుభారంభాన్ని సాధించాడు. మంగళవారం రాత్రి కేవలం 21 నిమిషాల్లో పూర్తి ఏకపక్షంగా ముగిసిన ఈ పోరులో శ్రీకాంత్ 21-4, 21-11 తేడాతో అలెన్‌పై ఘన విజయం సాధించాడు. రెండో రౌండ్‌లో శ్రీకాంత్ జపాన్‌కు చెందిన యుసుకె ఒనోడెరాతో తలపడనున్నాడు. కాగా, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో భారత ఆటగాళ్లు సుభాంకర్ డే, హర్షిత్ అగర్వాల్ కూడా సత్తా చాటుకున్నారు. చైనా షట్లర్ జావో జున్‌పెంగ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో సుభాంకర్ డే 16-21, 21-17, 21-19 తేడాతో చెమటోడ్చి విజయం సాధించగా, హర్షిత్ అగర్వాల్ 18-21, 21-8, 21-6 గేముల తేడాతో జోర్న్ సెగున్ (అమెరికా)ను ఓడించాడు. తదుపరి రౌండ్‌లో హర్షిత్ హాంకాంగ్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ఆటగాడు హు యున్‌తో తలపడనున్నాడు.
అయితే పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు చెందిన సిరిల్ వర్మ, హర్షీల్ డానీ, చిట్టబోయిన రాహుల్ యాదవ్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. సిరిల్ వర్మ 13-21, 10-21 తేడాతో లిన్ దాన్ (చైనా) చేతిలో ఓటమి పాలవగా, హర్షీల్ 13-21, 12-21 తేడాతో చైనీస్ తైపీకి చెందిన ఆరోసీడ్ ఆటగాడు చౌ తియెన్ చేతిలోనూ, రాహుల్ యాదవ్ 18-21, 18-21 తేడాతో మిషా జిల్బర్మన్ (ఇజ్రాయెల్) చేతిలోనూ పరాజయం పాలయ్యారు.
అలాగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత్‌కు చెందిన తన్వీ లాడ్ కూడా 14-21, 12-21 తేడాతో ఇండోనేషియాకు చెందిన ప్రిస్కిలా సియాహయా చేతిలో ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.