క్రీడాభూమి

సఫారీలకు చుక్కలు చూపిన గుప్టిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, మార్చి 1: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా బుధవారం హామిల్టన్‌లోని సెడాన్ పార్కులో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అజేయంగా 180 పరుగుల రికార్డు స్థాయి వ్యక్తిగత స్కోరుతో రెచ్చిపోయాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి 2-2తో సిరీస్‌ను సమం చేసింది. టాస్ గెలిచి తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ క్వింటోన్ డీకాక్ పరుగుల ఖాతా ఆరంభించకుండానే పెవిలియన్‌కు చేరగా, ఓపెనర్ హషీమ్ ఆమ్లా, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఫఫ్ డుప్లెసిస్ స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రెండో వికెట్‌కు వీరు 65 పరుగులు జోడించిన తర్వాత ఆమ్లా (40)ను జీతన్ పటేల్ క్లీన్‌బౌల్డ్ చేయగా, అతని స్థానంలో వచ్చిన జెపి.డుమినీ (25)తో పాటు డుప్లెసిస్ (67), డేవిడ్ మిల్లర్ (1), డ్వైన్ ప్రిటోరియస్ (10) వికెట్లను దక్షిణాఫ్రికా 30 పరుగుల వ్యవధిలో చేజార్చుకుంది. ఈ తరుణంలో కెప్టెన్ ఎబి.డివిలియర్స్ క్రీజ్‌లో నిలదొక్కుకుని కివీస్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించాడు. క్రిస్ మోరిస్ (28)తో కలసి ఏడో వికెట్‌కు 58 పరుగులు, వేన్ పార్నెల్ (29)తో కలసి ఎనిమిదో వికెట్‌కు మరో 63 పరుగులు జోడించిన డివిలియర్స్ 72 పరుగుల వ్యక్తిగత స్కోరుతో అజేయంగా నిలిచాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు సాధించింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ డీన్ బ్రౌన్లీ (4), కెప్టెన్ కాన్ విలియమ్‌సన్ (21) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ క్రీజ్‌లో నిలదొక్కుకుని దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. రాస్ టేలర్ అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని చూడముచ్చటైన షాట్లతో విజృంభించి ఆడిన గుప్టిల్ కేవలం 82 బంతుల్లో శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు మూడో వికెట్‌కు 187 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. ఆ తర్వాత టేలర్ 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించగా, వికెట్‌కీపర్ ల్యూక్ రోంచీ (1)తో కలసి మిగిలిన పని పూర్తి చేసిన గుప్టిల్ 138 బంతుల్లో 11 సిక్సర్లు, మరో 15 ఫోర్ల సహాయంతో 180 పరుగుల అజేయ స్కోరు సాధించాడు. అంతర్జాతీయ వనే్డ క్రికెట్ చేజింగ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు సాధించిన అత్యధిక స్కోరుగా ఇది రికార్డులకు ఎక్కింది. దీంతో 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 280 పరుగులు రాబట్టిన న్యూజిలాండ్ మరో 30 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో సఫారీలను మట్టికరిపించింది.