క్రీడాభూమి

ఇటాలియన్ ఓపెన్‌లో షరపోవాకు వైల్డ్‌కార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, మార్చి 1: అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌లో ఐదు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి, రష్యా అందాల భామ మరియా షరపోవాకు ఈ ఏడాది మే నెలలో జరుగనున్న ఇటాలియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో వైల్డ్‌కార్డు లభించింది. ఈ టోర్నీ నిర్వాహకులు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. డోపింగ్‌కు పాల్పడినందుకు 15 నెలల పాటు నిషేధానికి గురైన ఆమె ఈ నిషేధం పూర్తయిన తర్వాత ఏప్రిల్‌లో స్టట్‌గార్ట్‌లో జరిగే టోర్నీ ద్వారా అంతర్జాతీయ సర్క్యూట్‌లో మళ్లీ తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. రోమ్‌లో (ఇటాలియన్ ఓపెన్‌లో) మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన షరపోవాకు ఈసారి వైల్డ్‌కార్డు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తున్నామని టోర్నీ నిర్వాహకులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఓపెన్-2016లో షరపోవా మెల్డోనియం అనే నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని వాడినట్లు తేలడంతో ఆమెపై తొలుత అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) రెండేళ్లు నిషేధం విధించగా, ఆ తర్వాత అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు ఈ నిషేధాన్ని 15 నెలలకు తగ్గించిన విషయం విదితమే. అయితే షరపోవాకు మాడ్రిడ్ ఓపెన్ టోర్నీలో కూడా వైల్డ్‌కార్డు లభించింది. దీంతో ఆమె స్టట్‌గార్ట్ టోర్నీ తర్వాత మే 6వ తేదీ నుంచి మాడ్రిడ్ ఓపెన్‌లోనూ, మే 15వ తేదీ నుంచి ఇటాలియన్ ఓపెన్‌లోనూ ఆడనుంది.