క్రీడాభూమి

ఇరాన్ సైక్లింగ్ జట్టుపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐగ్లే (స్విట్జర్లాండ్), మార్చి 2: ఇరాన్‌కు చెందిన మూడో శ్రేణి సైక్లింగ్ జట్టు పిష్గమన్ సైక్లింగ్‌పై వేటు పడింది. ఆ జట్టులోని ఇద్దరు సభ్యులు నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడినట్లు డోపింగ్ పరీక్షల్లో స్పష్టమవడంతో రేసుల నుంచి ఆ జట్టు మొత్తాన్ని 30 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ స్పెన్షన్ ఈ నెల 6వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగుతుందని, దీంతో ఆ జట్టు నెల రోజుల పాటు అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనేందుకు వీలుండదని ఇంటర్నేషనల్ సైక్లింగ్ యూనియన్ (యుసిఐ) ప్రకటించింది. అయితే ఇరాన్ జట్టులో డోపింగ్‌కు పాల్పడిన ఇద్దరు రైడర్లు ఎవరన్నదీ యసిఐ పాలక మండలి వెల్లడించలేదు. డోపింగ్ వ్యవహారంలో ఇరాన్ అపఖ్యాతిని మూటగట్టుకోవడం ఇదే తొలిసారి కాదు. 2015 డిసెంబర్‌లో మలేసియాలో జరిగిన రేసు సందర్భంగా ఇరాన్‌కు చెందిన నసీర్ రెజావీ అనబాలిక్ స్టెరాయిడ్‌ను ఉపయోగించినట్లు డోపింగ్ పరీక్షల్లో తేలడంతో అతనిపై నాలుగేళ్ల పాటు నిషేధాన్ని విధించారు. అలాగే ఇరాన్‌కే చెందిన రహీమ్ ఇమామీ అనే మరో రైడర్ అనబాలిక్ స్టెరాయిడ్ ఉపయోగించినట్లు గత ఏడాది అక్టోబర్‌లో తేలడంతో అతనిపై కూడా యుసిఐ ప్రాథమిక సస్పెన్షన్ వేటు వేసింది.