క్రీడాభూమి

నాకు నేనే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: కాలిగాయానికి శస్త్ర చేయించుకుని నాలుగు నెలల విశ్రాంతి తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తాను ఎవరికీ పోటీ కాదని, తనకు తానే పోటీ అని అన్నాడు. భారత జట్టులో స్థానం కోసం అజింక్య రహానే, కరుణ్ నాయర్‌లతో రోహిత్ శర్మ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. నాలుగు నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్‌లో భాగంగా ఈ నెల 4న ఆంధ్ర-ముంబయి జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సందర్భంగా పిటిఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్‌లో ఇప్పటివరకు తాను ఎవరినీ పోటీగా షహించుకోలేదని, తనకు తానే పోటీ అని స్పష్టం చేశాడు. ‘ఎవరయినా పోటీ అని భావించినట్లయితే ఒక అటగాడిగా ఎదగలేరు. నా అదుపులో లేని విషయాల గురించి ఆలోచించి నా సమయాన్ని వృథా చేసుకోను. అయితే భారత్ ఆడే ఏ ఒక్క మ్యాచ్‌నీ మిస్ కాకూడదని కోరుకుంటాను’ అని రోహిత్ శర్మ చెప్పాడు. అయితే తాను ఇప్పుడు పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నానని, త్వరలోనే తిరిగి జట్టులో స్థానం పొందగలనని ఆశిస్తున్నానని చెప్పాడు.