క్రీడాభూమి

సెమీస్‌కు బొపన్న జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మార్చి 2: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నెంబర్ వన్ డబుల్స్ ఆటగాడు రోహన్ బొపన్న, అతని కొత్త భాగస్వామి మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలెండ్) సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో అన్‌సీడెడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు బుధవారం తెల్లవారు జామున జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో 6-3, 6-4 సెట్ల తేడాతో ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా), విక్టర్ ట్రాయ్‌కీ (సెర్బియా) జోడీని మట్టికరిపించారు. ప్రస్తుత సీజన్ ఆరంభంలో జీవన్ నెడుంచెజియన్‌తో కలసి చెన్నై ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న బొపన్న ఈ సీజన్‌లో భాగస్వామిని మార్చడం ఇది నాలుగోసారి. ప్రస్తుత సీజన్‌లో బొపన్నకు ఇది రెండవ అత్యుత్తమ ప్రదర్శన. దుబాయ్ ఓపెన్ తొలి రౌండ్‌లో బొపన్న, మట్కోవ్‌స్కీ 5-7, 6-3, 11-9 సెట్ల తేడాతో రెండోసీడ్ జోడీ ఇవాన్ డోడిగ్, మార్సెల్ గ్రానోలర్స్‌పై సంచలన విజయం సాధించారు.
పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో జరగాల్సిన మరో మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి గులెర్మో గార్సికా లోపెజ్ (స్పెయిన్) మూడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన డేనియల్ నెస్టర్ (కెనడా), ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)పై విజయం సాధిస్తే సెమీఫైనల్‌లో పేస్‌కు, బొపన్నకు మధ్య పోరాటం జరిగే అవకాశం ఉంటుంది.