క్రీడాభూమి

ఫెదరర్‌కు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మార్చి 2: స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఊహించని షాక్ ఎదురైంది. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఫెదరర్ గురువారం ఇక్కడ

జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో రష్యాకు చెందిన 26 ఏళ్ల యువ క్వాలిఫయర్ ఆటగాడు యెవ్‌గెని డొన్‌స్కోయ్ (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 116వ స్థానం) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజేతగా నిలిచి 18వ గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న ఫెదరర్ ఈ మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడి 6-3 తేడాతో తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత ప్రత్యర్థి తీవ్రస్థాయిలో విజృంభించడంతో డీలా పడిన ఫెదరర్ 6-7(7/9), 6-7(7/5) తేడాతో వరుసగా రెండు సెట్లను చేజార్చుకోవడంతో డొన్‌స్కోయ్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. 2007 తర్వాత ఫెదరర్‌కు క్వాలిఫయర్ ఆటగాడి చేతిలో పరాజయం ఎదురవడం ఇది మూడోసారి. ఈ మ్యాచ్‌లో డొన్‌స్కోయ్ విజయంతో ఈ ఏడాది ఎనిమిది వరుస విజయాల తర్వాత ఫెదరర్‌కు అడ్డుకట్ట పడింది. సెమీఫైనల్‌లో స్థానం కోసం డొన్‌స్కోయ్ ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ పౌలీతో తలపడనున్నాడు.
ఇదిలావుంటే, ఈ టోర్నీలో బ్రిటన్‌కు చెందిన టాప్‌సీడ్ ఆటగాడు ఆండీ ముర్రే క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. పూర్తి ఏకపక్షంగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో 6-2, 6-0 తేడాతో గులెర్మో గార్సికా లోపెజ్‌ను మట్టికరిపించిన ముర్రే క్వార్టర్ ఫైనల్‌లో జర్మనీకి చెందిన ఫిలిప్ కోల్‌స్క్రైబర్‌తో తలపడనున్నాడు. ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో కోల్‌స్క్రైబర్ 6-4, 6-4 సెట్ల తేడాతో రష్యాకు చెందిన డనిల్ మెద్వదెవ్‌పై విజయం సాధించగా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ 12వ ర్యాంకు ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్ 6-4, 3-6, 6-1 తేడాతో డాన్ ఇవాన్ (బ్రిటన్)ను, ఫ్రాన్స్‌కే చెందిన ఏడోసీడ్ ఆటగాడు పౌలీ 6-1, 6-4 తేడాతో మారియస్ కోపిల్‌ను, స్పెయిన్‌కు చెందిన ఫెర్నాండో వెర్డాస్కో 6-4, 3-6, 7-5 తేడాతో స్పెయిన్‌కే చెందిన రాబెర్టో బటిస్టా అగట్‌ను ఓడించారు.

చిత్రం.. రోజర్ ఫెదరర్‌, క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన ఆండీ ముర్రే